China లోని హెబెయ్‌ ప్రావిన్స్‌ను ముంచెత్తిన వరదలు – 29 మంది మృతి, 16 మంది గల్లంతు

హెబెయ్‌, ఆగష్టు 11  (ఇయ్యాల తెలంగాణ) :  భారీ వర్షాల కారణంగా చైనాలోని హెబెయ్‌ ప్రావిన్స్‌ను వరదలు ముంచెత్తాయి. ఈ వరదల వల్ల ప్రావిన్స్‌లోని లోతట్టు ప్రాంతాలకు తీవ్ర నష్టం వాటిల్లింది. మొత్తం 29 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 16 మంది గల్లంతయ్యారు. ఈ ప్రకృతి విపత్తు హెబెయ్‌ ప్రావిన్స్‌కు 95.811 బిలియన్‌ యువాన్‌ల నష్టాన్ని మిగిల్చిందని అధికారులు తెలిపారు.గత కొన్ని రోజులుగా ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తుండటంతో హెబెయ్‌ ప్రావిన్స్‌లో వరదలు పోటెత్తాయని చైనా ఆర్థికమంత్రి చెప్పారు. ఈ ప్రకృతి విపత్తును ఎదుర్కోవడానికి అదనంగా 1.46 బిలియన్‌ యువాన్‌లను ఆర్థిక సాయంగా అందించినట్లు ఆయన తెలిపారు. వివిధ వరద ప్రభావిత రీజయన్లలో పునరావాస చర్యల కోసం ప్రభుత్వం ఇప్పటికే 7.738 బిలియన్‌ల నిధులను మంజూరు చేసిందని, తాజా నిధులు అందుకు అదనమని పేర్కొన్నారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....