CI పై కానిస్టుబుల్‌ హత్యాయత్నం

హైదరాబాద్‌, నవంబర్‌ 2,(ఇయ్యాల తెలంగాణ ):మహబూబ్‌ నగర్‌ సీసీఎస్‌ సీఐ ఇఫ్తికార్‌ అహ్మద్‌ పై బుధవారం అర్ధరాత్రి హత్యాయత్నం జరిగింది. స్థానికంగా ఓ పీఎస్‌ లో విధులు నిర్వహిస్తోన్న ఓ కానిస్టేబుల్‌ ఆయనపై హత్యా యత్నానికి పాల్పడ్డాడు. సీఐ ప్రైవేట్‌ పార్టు కోసేయడం సహా ఆయన తలపై పదునైన ఆయుధాలతో నిందితుడు దాడి చేశాడు. అనంతరం సీఐ వచ్చిన కారులోనే పట్టణ సవిూపంలోని రోడ్లపై వదిలి వెళ్లాడు. ఉదయాన్నే సీఐను గుర్తించిన స్థానికులు, స్థానిక ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వివాహేతర సంబంధమే దీనికి కారణమని భావిస్తున్నారు

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....