CLP నేత భట్టి విక్రమార్క నామినేషన్‌ దాఖలు

మధిర నవంబర్ 9 (ఇయ్యాల తెలంగాణ ):సిఎల్పీ నేత భట్టి విక్రమార్క  గురువారం  నామినేషన్‌ దాఖలు చేసారు. అంతకుముందు వైరా శబరి నగర్‌ లోని అయ్యప్ప దేవాలయంలో కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకుని వేద పండితుల ఆశీర్వచనం తీసుకున్నారు. ఆ తర్వాత స్థానిక సాయిబాబా ఆలయంలో పూజలు నిర్వహించారు.భట్టి విక్రమార్క  స్వగ్రామమైన వైరా మండలం స్నానాల  లక్ష్మీపురం గ్రామంలోని పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి ఆలయంలో కుటుంబ సమేతంగా పూజలు నిర్వహించారు. కృష్ణాజిల్లా నెమలి గ్రామంలో శ్రీకృష్ణ దేవాలయాన్ని భట్టి విక్రమార్క గారు కుటుంబ సమేతంగా సందర్శించి ప్రత్యేక పూజలు జరిపారు. అక్కడి నుంచి నేరుగా నామినేషన్‌ దాఖలు చేయడానికి వచ్చారు,ఈ కార్యక్రమంలో భట్టి విక్రమార్క సతీమణి మల్లు నందిని విక్రమార్క, కుమారుడు మల్లు సూర్య విక్రమాధిత్య, వైరా కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి రాందాస్‌ నాయక్‌, ఖమ్మం డిసిసి అధ్యక్షులు వాళ్ళ దుర్గాప్రసాద్‌, స్థానిక కాంగ్రెస్‌ నాయకులు పాల్గొన్నారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....