CM పై పోటీకి సీనియర్‌ జర్నలిస్టును దింపాలని BC సంఘాల సమాలోచన

సిద్దిపేట సెప్టెంబర్‌ 22 (ఇయ్యాల తెలంగాణ );రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని జనరల్‌ స్థానాల్లో బీసీ అభ్యర్థులను పోటీకి దింపాలని వివిధ జిల్లాలలో గల 26 బిసి సంఘాలు ఆలోచిస్తున్నట్లు బీసీ హక్కుల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు కే సత్యనారాయణ తెలిపారు.అందులో భాగంగా సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర రావు పై గజ్వేల్‌, కామారెడ్డి, సిరిసిల్ల, సిద్దిపేటలో ఎక్కడ పోటి చేసిన  సీనియర్‌ జర్నలిస్టును బీసీ వర్గానికి చెందిన వ్యక్తిని పోటికి దింపాలని ఆలోచిస్తున్నాయి. ఆ జర్నలిస్టు ఉమ్మడి మెదక్‌ జిల్లాలో సీనియర్‌ తొలిదశ, మలిదశ తెలంగాణ ఉద్యమంలో కూడా చురుకుగా పాల్గొన్నారు. సీఎంపై పోటీకి నిలిపి బీసీ సంఘాలన్నీ ఆ నియోజకవర్గంలో ప్రచారం చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇది ఇలా ఉండగా అక్టోబర్‌ మొదటి వారంలో హైదరాబాదులో సమావేశమై అభ్యర్థులను ప్రకటించాలని బీసీ సంఘాలు నిర్ణయించినట్లు తెలిపారు. 

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....