CM రిలీఫ్‌ ఫండ్‌ అంటే ఏమిటి…? `

ఎల్‌ఓసి అంటే ఏమిటి..? అనేవి ఇప్పుడు తెలుసుకుందాం`

హైదరాబాద్, ఆగష్టు 02 (ఇయ్యాల తెలంగాణ) :  సీఎం రిలీఫ్‌ ఫండ్‌ దరఖాస్తులను ఇక నుండి ఆన్‌లైన్‌లో మాత్రమే స్వీకరించనున్న ప్రభుత్వం సీఎం రిలీఫ్‌ ఫండ్‌ వేరు, ఎల్‌ఓసి (లెటర్‌ ఆఫ్‌ క్రెడిట్‌) వేరు. ఇప్పుడు వాటి గురించి అవగాహన కోసం తెలుసుకుందాం… సీఎం రిలీఫ్‌ ఫండ్‌ :`సీఎం రిలీఫ్‌ ఫండ్‌ అంటే ఏదైనా వైద్య చికిత్స, ఆపరేషన్‌ మొదలగునవి (హాస్పిటల్లో కనీసం ఒక్క రోజైనా అడ్మిట్‌ అయి ఉండాలి) చేయించుకున్నప్పుడు, హాస్పిటల్‌ వారిచ్చే డిశ్చార్జి సమ్మరి ఆధారంగా ముఖ్యమంత్రి కార్యాలయానికి దరఖాస్తు చేసుకుంటే, చికిత్సకు ఆయిన మొత్తం లో 40 శాతం వరకు ఇచ్చేవారు. కానీ ఇప్పుడు ఎన్ని లక్షల బిల్లు అయినప్పటికీ గరిష్టంగా రూ.60 వేలు మాత్రమే మంజూరు చేస్తున్నారు.  ఎల్‌ఓసి (లెటర్‌ ఆఫ్‌ క్రెడిట్‌) :ఎల్‌ఓసి అనేది ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్సకయ్యే ఖర్చు చెల్లిస్తామని ప్రభుత్వం  ఇచ్చే హావిూ పత్రం.ఎల్‌ఓసి అనేది ఎవరికైనా వైద్య చికిత్స, ఆపరేషన్‌ మొదలగునవి అవసరమున్నప్పుడు, బాధితుల దగ్గర ఒక్క రూపాయి కూడా లేనప్పుడు రాజకీయ నాయకులు, ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీల సిఫారసు తో ఇచ్చేదే ఎల్‌ఓసి. ఎల్వోసీ ద్వారా  నగదు లేకుండానే ప్రైవేటు ఆసుపత్రుల్లో ఉచిత వైద్యం అందుతుంది.ముఖ్యమంత్రి సహాయ నిధి ( సీఎం రిలీఫ్‌ ఫండ్‌ ) దరఖాస్తులను ఇక నుంచి ఆన్‌లైన్‌లో మాత్రమే తెలంగాణ ప్రభుత్వం స్వీకరించనున్నది. 

ఇందుకోసం  సెంటర్‌ ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ ఆధ్వర్యంలో రూపొందించిన వెబ్‌సైట్‌  ను ముఖ్యమంత్రి  రేవంత్‌ రెడ్డి  గత నెలలో సచివాలయంలో ప్రారంభించారు. సీఎంఆర్‌ఎఫ్‌ నిధులు పక్కదారి పట్టకుండా పారదర్శకతతో నిర్వహించాలని ముఖ్యమంత్రి  ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు.గతంలో ఈ నిధులు పక్కదారి పట్టిన నేపథ్యంలో ఈ విధానాన్ని రూపొందించారు. ఇకముందు సీఎంఆర్‌ఎఫ్‌  దరఖాస్తులను ఈ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది.జూలై 1 నుంచి ఆన్‌ లైన్‌ లో మాత్రమే దరఖాస్తులను స్వీకరిస్తున్నారు.సీఎంఆర్‌ఎఫ్‌ కోసం తమ వద్దకు వచ్చే వారి వివరాలు తీసుకుని ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు తమ సిఫార్సు లేఖను జత చేసి అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది.అప్లికేషన్‌ లో సంబంధింత దరఖాస్తుదారుడి బ్యాంక్‌ అకౌంట్‌ నెంబర్‌ తప్పనిసరిగా ఇవ్వాలి. అప్‌లోడ్‌ చేసిన తర్వాత సీఎంఆర్‌ఎఫ్‌ కు సంబంధించిన ఒక కోడ్‌ ఇస్తారు. ఆ కోడ్‌ ఆధారంగా ఒరిజినల్‌ మెడికల్‌ బిల్లులను సచివాలయంలో అందజేయాల్సి ఉంటుంది.ఆన్‌లైన్‌ ద్వారా అప్లికేషన్‌ను సంబంధిత ఆస్పత్రులకు పంపించి నిర్ధారించుకుంటారు. అన్ని వివరాలు సరిగ్గా ఉంటే సీఎంఆర్‌ఎఫ్‌ దరఖాస్తును ఆమోదించిన తర్వాత పక్కదారి పట్టే అవకాశం లేకుండా చెక్‌ పైన తప్పని సరిగా దరఖాస్తుదారుడి అకౌంట్‌ నెంబర్‌ను ముద్రిస్తారు..

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....