Dalapathi విజయ్‌ Birth డే సందర్భంగా ‘జన నాయకుడు’ Movie నుంచి ఫస్ట్‌ రోర్‌ రిలీజ్‌

దళపతి విజయ్‌ నటిస్తోన్న ‘జన నాయకుడు’ చిత్రాన్ని హిస్టారికల్‌ మూవీగా అందరూ అభివర్ణిస్తున్నారు. అందుకు కారణం ఆయన నటిస్తోన్న చివరి చిత్రమిది. దళపతి విజయ్‌ బర్త్‌ డే సందర్భంగా మేకర్స్‌ ‘ఫస్ట్‌ రోర్‌’ గ్లింప్స్‌ను విడుదల చేశారు.  ఇప్పుడీ గ్లింప్స్‌ ఇంటర్నెట్‌లో సెన్సేషన్‌ క్రియేట్‌ చేస్తోంది. ఆయన చివరి చిత్రం కావటంతో ఈ లెజెండ్రీకి వీడ్కోలు పలకటానికి బీజం చేసినట్లు గ్లింప్స్‌ చూస్తుంటే అర్థమవుతుంది.

65 సెకన్ల వ్యవధి ఉన్న ‘జన నాయకుడు’ ఫస్ట్‌ రోర్‌ వీడియోను గమనిస్తే,  ‘నా హృదయంలో ఉండే..’ అనే మాటలు విజయ్‌ వాయిస్‌లో మనకు వినిపిస్తాయి. పోలీస్‌ డ్రెస్‌లో లాఠీ పట్టుకుని యుద్ధ వాతావరణాన్ని తలపించే ప్రదేశంలో నడుస్తూ వస్తుంటారు. ఈ విజువల్స్‌ చూస్తుంటే మైండ్‌ బ్లోయింగ్‌గా ఉన్నాయి. శక్తి, శాంతి, గంభీరతను కలగలిపేలా ఉన్న ఈ సన్నివేశం చూస్తుంటే జన నాయగన్‌ మూవీ దళపతి విజయ్‌కి సాధారణ వీడ్కోలు కాబోదనే సంకేతాన్ని స్పష్టంగా ఇస్తోంది.

ఫస్ట్‌ రోర్‌ వీడియోతో పాటు విడుదలైన బర్త్‌ డే పోస్టర్‌ మరింతగా మెప్పిస్తోంది. పెద్ద సింహాససనం విూద దళపతి విజయ్‌ ఠీవిగా కూర్చుని చేతిలో కత్తిని పట్టుకున్నాడు. ఇన్‌టెన్స్‌ బ్యాక్‌డ్రాప్‌లో కూర్చున్న విజయ్‌ చుట్టూ పొగ ఆవరించబడి ఉంది.  ఈ పోస్టర్‌ చూస్తుంటే  ఓ రాజు, యోధుడు, నాయకుడు కలిసిన వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి మన కథానాయకుడని పవర్‌ఫుల్‌ పోస్టర్‌ చూస్తుంటే స్పష్టమవుతుంది.

జననాయకుడు.. దళపతి విజయ్‌ నటిస్తోన్న చివరి చిత్రం కావటంతో దీని చుట్టూ ఓ భావోద్వేగం నిండి ఉంది. ఇది కేవలం సినిమా మాత్రమే కాదు, స్టార్‌డమ్‌కి అర్థాన్ని మార్చేసిన హీరో కెరీర్‌కి ఇస్తున్న ముగింపుగా భావిస్తున్నారు. ఇది ఓ వ్యక్తి ఉద్యమంగా మారాడో తెలియజేసే గొప్ప నివాళి.

భావోద్వేగమైన కథలను చెప్పటంలో దిట్ట అయిన హెచ్‌.వినోద్‌ జన నాయగన్‌ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా అనిరుద్‌ రవిచందర్‌ సంగీతాన్ని అందిస్తున్నారు. విజయ్‌, అనిరుద్‌ కాంబోలో ఇది వరకే ఎన్నో బ్లాక్‌ బస్టర్‌ పాటలు వచ్చిన సంగతి తెలిసిందే. మరోసారి ఈ కాంబో ప్రేక్షకులందరికీ అద్భుతమైన అనుభూతినివ్వనుంది.

కె.వి.ఎన్‌.ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై వెంకట్‌ కె.నారాయణ రూపొందిస్తోన్న జన నాయకుడు చిత్రం ప్రపంచ వ్యాప్తంగా జనవరి 9, 2026న సంక్రాంతి సందర్భంగా గ్రాండ్‌ రిలీజ్‌ అవుతుంది. భారీ అంచనాలున్న ఈ సినిమా విజయ్‌కి గొప్ప సెండాఫ్‌గా నిలవనుంది. మూడు దశాబ్దాల గొప్ప వారసత్వానికి ఇది గొప్ప వేడుకగా నిలవనుంది.

అన్నీ మాధ్యమాల్లో జన నాయకుడు ఫస్ట్‌ రోర్‌ దూసుకెళ్తోంది. దళపతి విజయ్‌ నటిస్తోన్న చివరి సినిమా కావటంతో ఈ ప్రయాణానికి శక్తి, గర్వం, భావోద్వేగంతో కూడిన వీడ్కోలు ఇవ్వటానికి అభిమానులు సిద్ధమవుతున్నారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....