deferral films – చిత్రం టైటిల్‌’ కాంత’

 టాలీవుడ్‌ హ్యాండ్సమ్‌ హంక్‌ రానా దగ్గుబాటి, దుల్కర్‌ సల్మాన్‌, సెల్వమణి సెల్వరాజ్‌, స్పిరిట్‌ విూడియా డ వేఫేరర్‌ ఫిల్మ్స్‌ చిత్రం టైటిల్‌’ కాంత’

టాలీవుడ్‌ హ్యాండ్సమ్‌ హంక్‌ రానా, తెలుగులో బ్యాక్‌ టు బ్యాక్‌ హిట్స్‌ సాధించిన మలయాళ సూపర్‌ స్టార్‌ దుల్కర్‌ సల్మాన్‌ ఓ చిత్రం కోసం జతకట్టారు. రానా స్పిరిట్‌ విూడియా, దుల్కర్‌ సల్మాన్‌ వేఫేరర్‌ ఫిల్మ్స్‌ సంయుక్తంగా నిర్మించనున్న ఈ మల్టీ లింగ్వల్‌ చిత్రానికి సెల్వమణి సెల్వరాజ్‌ దర్శకత్వం వహించనున్నారు. దుల్కర్‌ సల్మాన్‌ పుట్టినరోజున మేకర్స్‌ ఆసక్తికరమైన పోస్టర్‌తో సినిమా టైటిల్‌ను విడుదల చేశారు. ఈ చిత్రానికి ‘కాంత’ అనే ఇంట్రస్టింగ్‌ టైటిల్‌ పెట్టారు. సహ నిర్మాతగా వ్యవహరించడంతో పాటు దుల్కర్‌ సల్మాన్‌ ఈ చిత్రంలో లీడ్‌ రోల్‌ పోషించనున్నారు.ఈ సినిమాతో అసోసియేట్‌ అవ్వడానికి చాలా ఎక్సయిటెడ్‌ గా వున్న రానా ఇది ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇస్తుందని భరోసా ఇచ్చారు. ఈ చిత్రం గురించి రానా మాట్లాడుతూ.. ‘‘చాలా అరుదుగా మంచి సినిమా పవర్‌ గుర్తు చేసే కథ మనకు కనిపిస్తుంది. కాంత మమ్మల్ని ఒకచోట చేర్చిన ప్రాజెక్ట్‌. సూపర్‌ ట్యాలెంటెడ్‌ దుల్కర్‌ సల్మాన్‌, వేఫేరర్‌ ఫిలిమ్స్‌ తో ఈ ప్రయాణాన్ని ప్రారంభించడం పట్ల మేము ఆనందిస్తున్నాము. అతని పుట్టినరోజు సందర్భంగా రాబోయే సరికొత్త ప్రపంచానికి సంబధించిన టైటిల్‌ రివిల్‌ చేశాం. పుట్టినరోజు శుభాకాంక్షలు దుల్కర్‌ సల్మాన్‌. కాంత ప్రపంచానికి స్వాగతం.??’’ అన్నారు.

ఈ చిత్రానికి సంబంధించిన ఇతర నటీనటులు, టీం వివరాలు మేకర్స్‌ త్వరలో తెలియజేస్తారు. 

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....