DELHIలో వాయు కాలుష్యం.. ఎయిర్‌ క్వాలిటీ ఇండెక్స్‌ 309గా నమోదు

న్యూ డిల్లీ అక్టోబర్‌ 24 (ఇయ్యాల తెలంగాణ );దేశ రాజధాని ఢల్లీలో వాయు కాలుష్యం తీవ్రతరమవుతున్నది. సోమవారం ఢల్లీలో గాలి నాణ్యత చాలా పేలవమైన కేటగిరికి చేరింది. ఎయిర్‌ క్వాలిటీ ఇండెక్స్‌ 309గా నమోదైంది. అదే సమయంలో ఢల్లీిలో ఎన్‌సీఆర్‌లో గాలి నాణ్యత పడిపోయింది. ఢల్లీ ఎన్‌సీఆర్‌లో ఎయిర్‌ క్వాలిటీ ఇండెక్స్‌ 322గా నమోదైందని సఫర్‌ తెలిపింది. పొగమంచు కారణంగా దృశ్యమానత తగ్గింది. ఢల్లీలోని ఆనంద్‌ విహార్‌, హసన్‌పూర్‌ డిపో, తొమ్మిదో నెంబర్‌ జాతీయ రహదారి పొగ మంచు భారీగా పేరుకుపోయింది. ఫలితంగా రోడ్లపై ఎదురుగా వచ్చే వాహనాలు సైతం కనిపించడం లేదు.అలాగే నెహ్రూ పార్క్‌, తీన్‌మూర్తి మార్గ్‌ చుట్ట పక్కల ప్రాంతాల్లోను పొగమంచు కమ్మేసింది. ఇండియా గేట్‌, డ్యూటీ పత్‌లోనూ పొగమంచు పేరుకుపోయింది. మరో వైపు ఢల్లీలో పెరుగుతున్న కాలుష్యం మధ్య పర్యావరశాఖ మంత్రి గోపాల్‌రాయ్‌ అధికారులతో తెలిపారు. దేశ రాజధానిలో చలి పెరుగుతోందని, గాలి వేగం తగ్గిందని పేర్కొన్నారు. ఢల్లీలో రెండోగ్రాఫ్‌ అమలు చేసేందుకు అన్నిశాఖల అధికారులతో సోమవారం మంత్రి సమావేశం ఏర్పాటు చేశారు.ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. అయితే, ఇప్పటికే పొరుగు రాష్ట్రాల మంత్రులతో మాట్లాడి.. వరి కొయ్యలు, పొట్టు, వ్యర్థాలను తగులబెట్టకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. అయితే, ఇండియా గేట్‌ పలువురు మాట్లాడుతూ 10`12 నుంచి నుంచి ఢల్లీలో కాలుష్యం పెరుగుతోందన్నారు. పొగదట్టంగా ఉందని.. పరిస్థితి ఏమాత్రం బాగోలేదన్నారు. సైక్లిస్టులంతా మాస్క్‌లతోనే తిరుగుతున్నామన్నారు. రాబోయే రోజుల్లో ఇదే పరిస్థితి కొనసాగితే సైకిల్‌ తొక్కడం మానేసి ప్రత్యామ్నాయంగా వ్యాయామాలు చేస్తామని సైక్లిస్ట్‌ తెలిపాం

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....