DELHI లిక్కర్‌ స్కామ్‌ కేసుల్లో మనీష్‌ సిసోడియా కు మరోసారి ఎదురుదెబ్బ

న్యూ డిల్లీ అక్టోబర్‌ 30 (ఇయ్యల తెలంగాణ ): ఢల్లీ లిక్కర్‌ స్కామ్‌ కేసుల్లో అరెస్టైన ఢల్లీి మాజీ ఉప ముఖ్యమంత్రి, ఆమ్‌ఆద్మీ పార్టీ నేత మనీష్‌ సిసోడియా కు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. అవినీతి, మనీలాండరింగ్‌ కేసుల్లో సిసోడియాకు బెయిల్‌ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ మేరకు బెయిల్‌ కోసం ఆయన దాఖలు చేసిన పిటిషన్లను ధర్మాసనం కొట్టేసింది.గతంలో సిసోడియా దాఖలు చేసిన రెండు వేర్వేరు బెయిల్‌ దరఖాస్తులపై అక్టోబర్‌17న తీర్పును రిజర్వ్‌ చేసిన న్యాయమూర్తులు సంజీవ్‌ ఖన్నా, ఎస్వీఎన్‌ భట్టిలతో కూడిన ధర్మాసనం.. తాజాగా తీర్పును వెలువరించింది. ఈ కేసుకు సంబంధించిన కొన్ని ఆధారాలను ఈడీ తమకుఅందించినట్లు కోర్టు తెలిపింది. లిక్కర్‌ స్కామ్‌లో రూ.338 కోట్ల నగదు బదిలీకి సంబంధించి ఈడీ కొన్ని ఆధారాలను చూపించినట్లు దేశ అత్యున్నత న్యాయస్థానం వెల్లడిరచింది. ఇక ఈ లిక్కర్‌ స్కామ్‌కేసులో విచారణను పూర్తి చేసేందుకు ఈడీకి సుప్రీంకోర్టు 6 నుంచి 8 నెలల సమయం ఇచ్చింది. విచారణ నెమ్మదిగా సాగితే.. మూడు నెలల్లోపు సిసోడియా మళ్లీ బెయిల్‌ కోసం దరఖాస్తు చేసుకునేందుకుఅర్హత పొందుతారని సుప్రీం పేర్కొంది.ఢల్లీి లిక్కర్‌ పాలసీ కుంభకోణంతో మనీష్‌ సిసోడియాకు సంబంధం ఉన్నట్లు ఆరోపణలు రావడంతో ఏడాదిన్నర క్రితం సీబీఐ, ఈడీ అధికారులు సిసోడియాను అరెస్ట్‌ చేసినవిషయం తెలిసిందే. లిక్కర్‌ స్కామ్‌ కేసును సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌ (సీబీఐ), ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) రెండూ విచారిస్తున్నాయి. ఈ క్రమంలో మనీష్‌ సిసోడియాను రెండు దర్యాప్తుసంస్థలకు చెందిన అధికారులూ ప్రశ్నిస్తున్నారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....