Devotional – లక్ష్మీ కటాక్షము పొందాలంటే ఏమి చేయాలి !

 ఓం 

“సర్వమంగళ మాంగళ్యేశివే సర్వార్థసాధికే 

శరణ్యేత్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే”

ధనం మూలం మిధం జగత్ అన్నారు . 

ప్రతి వారికి ఏది కావాలన్న డబ్బుతో ముడిపడి ఉంటుంది. కొంత మంది ఎంత శారీరక శ్రమ చేసిన ఏది కలిసి రానట్టుగా జీవితాలు సాగిపోతుంటాయి.మనకు ఉన్న  భాదలు తొలగించుకోవడానికి కొన్ని దైవిక సంబంధమైన చిట్కాలు పాటిస్తే ఫలితాలు తప్పక లభిస్తాయి.  జాతకంలో మనకు లక్ష్మీ కటాక్షం కలగాలంటే ప్రతి నిత్యం నిష్టగా పైన ఉన్న  శ్లోకాన్ని 108 సార్లు జపించాలి.

శ్రీ మహాలక్ష్మీ స్తవాన్ని త్రిసంధ్యలలో పఠించువారు మహాధనవంతులవుతారు – శ్రీదేవీ భాగవతము ప్రతి రోజూ సంపుటిత సహిత శ్రీసూక్తం చదివితే అఖండలక్ష్మి కటాక్షం కలుగుతుంది. కమల సప్తమీ వ్రతమును చైత్ర,వైశాఖ మాసాలలో శుక్ల సప్తమి నాడు శ్రీమత్స్య పురాణంలో చెప్పిన ప్రకా చేయటం వలన మహాసంపదలు కలుగుతాయి. కనకధారాస్తవము ప్రతిరోజూ త్రిసంధ్యలలోపఠిస్తే అపార సంపద చేకూరుతుంది. శుక్రవారం లక్ష్మీదేవిని అష్ట గంధాలతో (కర్పూరం,కస్తూరి, పుణుగు,జవ్వాది,అగరు,పన్నీరు, అత్తరు,శ్రీగంధం)తో పూజిస్తే కీర్తి , ప్రతిష్టతలు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఉగాది తరువాత వచ్చే శుక్రవారం ఇష్టమైన దైవానికి అభిషేకం చేయడం ద్వారా ఆ సంవత్సరమంతా ధనానికి కొదవ ఉండదు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....