DJ లు, టపాసుల కట్టడికి ప్రణాళిక !

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 27, (ఇయ్యాల తెలంగాణ) : డీజేలు, టపాసుల వాడకంపై పోలీసులు ప్రత్యేక దృష్టిసారించారు. ఇందుకు సంబంధించి త్వరలోనే గైడ్‌ లైన్స్‌ ను జారీ చేస్తామంటూ డీజీపీ జితేందర్‌ ఇప్పటికే ప్రకటించారు.డీజే వాడకం విషయంలో పలు జాగ్రతలు పాటించాలి. డీజే శబ్దాలపై చాలా ఫిర్యాదులు వస్తున్నాయి. అవి అధిక శబ్ధం చేస్తుండడంతో ఇళ్లల్లో వయసువిూరిన వారు చాలా ఇబ్బందిపడుతున్నారు. డీజే శబ్దాల కారణంగా గుండె అదురుతుందని వారు ఆందోళన చెందుతున్నారు’ అంటూ సీపీ పేర్కొన్నారు.అయితే, గణేష్‌ నిమజ్జనమే కాదు.. మిలాద్‌ ఉన్‌ నబీలో విపరీతంగా డీజేలు వాయిస్తూ డ్యాన్సులు చేశారు. పబ్‌ లో డ్యాన్సులు చేసిన విధంగా ర్యాలీల్లోనూ డ్యాన్సులు చేస్తున్నారు. ఈ క్రమంలో డీజే శబ్దాలను కట్టడి చేయాలని చాలా సంఘాల నుంచి వినతులు వస్తున్నాయి. డీజే శబ్ధాలను కంట్రోల్‌ చేయకపోతే ఆరోగ్యాలు దెబ్బతినే అవకాశం ఉంది. అందుకే వివిధ వర్గాలను పిలిచి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశాం. ఈ విషయంలో విూ అందరి అభిప్రాయాన్ని తీసుకుని ప్రభుత్వానికి అందజేస్తాం. ఆ తరువాత దీనిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది’ అంటూ సీవీ ఆనంద్‌ పేర్కొన్నారు.కాగా, ఈ రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఆమ్రపాలి, కాంగ్రెస్‌ ఎంపీ అనిల్‌ కుమార్‌ యాదవ్‌, ఎమ్మెల్యే రాజాసింగ్‌ తోపాటు పలువురు ఎంఐఎం ఎమ్మెల్యేలు, సైబరాబాద్‌, హైదరాబాద్‌, రాచకొండ పోలీస్‌ అధికారులతోపాటు పలు పార్టీల ప్రతినిధులు, వివిధ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నట్లు తెలుస్తోంది.ఇదిలా ఉంటే.. వినాయక చవితితోపాటు పలు పండుగల వేళ నగరంలో డీజే శబ్దాల మోత మోగింది. ఆ వారం రోజులపాటు డీజే శబ్దాలు, డ్యాన్సులతో మార్మోగింది. మరో విషయమేమంటే.. డీజేల కారణంగా చోటు చేసుకున్న ప్రమాదాలకు సంబంధించిన వీడియోలు సోషల్‌ విూడియాలో అప్పుడప్పుడు వైరల్‌ అవుతుంటాయి. 

డీజేల వద్ద డ్యాన్సులు చేస్తూ మృతిచెందిన దృశ్యాలు ఆ వీడియోల్లో కనిపిస్తుంటాయి. ఓ వైపు డీజేల శబ్ధం, మరో వైపు వాటి వల్ల కలుగుతున్న డిస్టపెన్స్‌ పై పోలీసులకు భారీగా ఫిర్యాదులు వస్తున్న క్రమంలో పోలీసులు స్పెషల్‌ ఫోకస్‌ పెట్టారు. వాటిని కట్టడి చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు.ఆఏల విషయంలోనూ నిబంధనల ఉల్లంఘన జరుగుతోంది. నివాస ప్రాంతాల్లో పగలు 55 డెసిబెల్స్‌, రాత్రి 45 డెసిబెల్స్‌కి సౌండ్‌ మించకూడదు.. కమర్షియల్‌ ఏరియాల్లో పగలు 65 డెసిబెల్స్‌, రాత్రి 55 డెసిబెల్స్‌ వరకే సౌండ్‌కి పరిమితి ఉంటుంది. పారిశ్రామిక ప్రాంతాల్లో పగలు 75 డెసిబెల్స్‌, రాత్రి 70 డెసిబెల్స్‌కి లిమిట్‌ చేస్తూ నిబంధనలున్నాయి. ఇక స్కూళ్లు, కాలేజీలు, ఆసుపత్రుల ఉన్న ప్లేస్‌లైతే పూర్తిగా సైలెంట్‌ జోన్స్‌. కానీ వీటిని పట్టించు కోకుండా ఆఏలు హోరెత్తుతున్నాయి. అందుకే వీటిని కంట్రోల్‌ చేయడం ఎలాగనే దానిపై రౌండ్‌ టేబుల్‌ విూటింగ్‌లో చర్చించారు. వివిధ వర్గాల అభిప్రాయలను సేకరించిన హైదరాబాద్‌ పోలీసులు పూర్తి నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి అందిస్తారు

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....