EC బదిలీ చేసిన పోస్టులకు ప్యానెల్‌ పంపిన రాష్ట్ర ప్రభుత్వం

హైదరాబాద్‌ అక్టోబర్‌ 12 (ఇయ్యాల తెలంగాణ ): ఈసీ బదిలీ చేసిన పోస్టులకు రాష్ట్ర ప్రభుత్వం ప్యానెల్‌ పంపింది. ఒక్కో పోస్టుకు ముగ్గురు చొప్పున పేర్లను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి కేంద్ర ఎన్నికల సంఘానికి పంపారు. నలుగురు కలెక్టర్లు, ముగ్గురు సీపీలు, 10 మంది ఎస్పీ పోస్టులకు, రవాణా, ఎక్సైజ్‌, వాణిజ్య పన్నుల శాఖల కార్యదర్శుల పోస్టులకు, ఎక్సైజ్‌, వాణిజ్య పన్నుల కమిషనర్ల పోస్టులకు ప్యానెల్‌ పంపారు. ప్యానెల్‌ నుంచి ఒక్కొక్కరిని కేంద్ర ఎన్నికల సంఘం ఎంపిక చేయనుంది.వచ్చే నెలలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న ఐదు రాష్ట్రాల్లో కేంద్ర ఎన్నికల కమిషన్‌ భారీ ఎత్తున సీనియర్‌ అధికారులను బదిలీ చేసింది. బదిలీ అయిన వారిలో కలెక్టర్లు, పోలీస్‌ అధికారులు ఉన్నారు. తెలంగాణలో రంగారెడ్డి, మేడ్చల్‌ మల్కాజిగిరి, యాదాద్రి భువనగిరి, నిర్మల్‌ జిల్లాల కలెక్టర్లతో పాటు 13 మంది పోలీసు అధికారులు ఉన్నారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....