Etela Rajender కు తప్పిన ప్రమాదం

కరీంనగర్‌, సెప్టెంబర్‌ 4, (ఇయ్యాల తెలంగాణ) : బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ కాన్వాయ్‌ రోడ్డు ప్రమాదానికి గురైంది. అయితే బీజేపీ ప్రచార కమిటీ ఛైర్మెన్‌, హుజూరాబాద్‌ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్‌ కు తృటిలో ప్రమాదం తప్పిపోయింది. వీణవంక పర్యటనకు వెళ్ళి వస్తుండగా మానకొండుర్‌ మండలం లలితపూర్‌ లో ఈటెల కాన్వాయ్‌ ప్రమాదానికి గురైంది. గొర్రెలు అడ్డురావడంతో ముందు వెళ్తున్న కాన్వాయ్‌ ఒక్కసారిగా బ్రేక్‌ వేయడంతో ప్రమాదం జరిగింది. ముందు వెళ్తున్న వాహనాన్ని ఈటెల ప్రయాణిస్తున్న వాహనం ఢీకొట్టింది.  ఈటల క్షేమంగా ఉన్నారని, ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని తెలుస్తోంది. ఎమ్మెల్యేకు ఎలాంటి గాయాలు కాలేదని తెలియగానే ఆయన అభిమానులు, బీజేపీ శ్రేణులు ఊపిరి పీల్చుకున్నాయి.కరీంనగర్‌ జిల్లా మానకొండూరు మండలం, లలితాపూర్‌ గ్రామం వద్ద తాను ప్రయాణిస్తున్న వాహనానికి, తన సిబ్బంది ఉన్న వాహనానికి ప్రమాదం జరిగిందని ఎమ్మెల్యే ఈటల తెలిపారు. చీకటి పడడంతో ఎదురుగా వస్తున్న గొర్రెల మందను చివరి నిమిషంలో చూసి డ్రైవర్‌ ఒక్కసారిగా బ్రేక్‌ వేశాడు. దాంతో వెనక వస్తున్న ఎస్కార్ట్‌ వాహనం తాను ఉన్న వాహనానికి ఢీ కొట్టడంతో వాహనం స్వల్పంగా దెబ్బతిందని చెప్పారు. భగవంతుని దయవల్ల, ప్రజల ఆశీస్సులతో తనతో పాటు అందరూ క్షేమంగా ఉన్నారని, ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని ట్విట్టర్‌ (చీ)లో వెల్లడిరచారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....