February నెలాఖరులో కొత్త రేషన్‌కార్డుల కోసం దరఖాస్తులు !

హైదరాబాద్‌, జనవరి 23 (ఇయ్యాల తెలంగాణ) :  కొత్త రేషన్‌కార్డుల కోసం ఫిబ్రవరి నెలాఖరులో దరఖాస్తులను తీసుకోవాలని పౌరసరఫరాలశాఖ నిర్ణయించినట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఇప్పటికే కొత్త రేషన్‌కార్డుల కోసం ఆరు గ్యారెంటీల దరఖాస్తులతోపాటు విడిగా దరఖాస్తు తీసుకున్నారు. కానీ, వాటిని పరిగణనలోకి తీసుకోవడం లేదని తెలిసింది. గతంలో మాదిరిగానే విూ సేవ ద్వారా దరఖాస్తులు తీసుకోవాలని నిర్ణయించినట్టు సమాచారం. ఇప్పటికే నేషనల్‌ ఇన్ఫర్మేటిక్‌ సెంటర్‌ (ఎన్‌ఐసీ) ద్వారా ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను రూపొందించినట్టు తెలిసింది. కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలుకు రేషన్‌కార్డును ప్రభుత్వం ప్రామాణికంగా తీసుకుంటున్నది.రాష్ట్రంలో చాలా మందికి రేషన్‌కార్డులు లేకపోవడంతో వారంతా ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో కొత్తగా రేషన్‌కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలిసింది. ప్రస్తుతం రాష్ట్రంలో 90 లక్షల తెల్ల రేషన్‌కార్డులు ఉండగా 2.86 కోట్ల మంది లబ్ధిదారులన్నారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో సుమారు 6.5 లక్షల కొత్త రేషన్‌కార్డులను జారీ చేసింది. తద్వారా సుమారు 20 లక్షల మందికి లబ్ధి జరిగింది.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....