FOOD POISONING పై HIGH COURT నోటీసులు

హైదరాబాద్‌,  సెప్టెంబర్‌ 20 (ఇయ్యాల తెలంగాణ );తెలంగాణలోని రెసిడెన్షియల్‌ స్కూళ్లు, హాస్టల్స్‌లో ఇటీవల ఫుడ్‌ పాయిజనింగ్‌ సంఘటనలు ఎక్కువయ్యాయి. వరుసగా విద్యార్థులు అస్వస్థతకు గురికావడంతో.. హైకోర్టులో పిటిషన్‌  దాఖలైంది. దీనిపై విచారణ జరిపిన ధర్మాసనం ప్రభుత్వాలపై సీరియస్‌ అయ్యింది. రెసిడెన్షియల్‌ స్కూళ్లలో చదివే విద్యార్థులు.. వరుసగా ఫుడ్‌పాయిజన్‌ బారిన ఎందుకు  పడుతున్నారో రెండు వారాల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించింది. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలతోపాటు మహిళా శిశు సంక్షేమ శాఖ, సాంఘిక సంక్షేమ, గిరిజన సంక్షేమ హాస్టళ్లను  పర్యవేక్షిస్తున్న అధికారులకు తెలంగాణ హైకోర్టు మంగళవారం నోటీసులు జారీ చేసింది. హాస్టళ్ల పనితీరుపై స్టేటస్‌ రిపోర్టును కూడా కోరింది హైకోర్టు. తెలంగాణలోని రెసిడెన్షియల్‌ హాస్టళ్లలో ఫుడ్‌ పాయిజనింగ్‌ ఘటనలను అరికట్టడంలో అధికారుల నిర్లక్ష్యాన్ని ప్రశ్నిస్తూ హైదరాబాద్‌కు చెందిన కె.అఖిల్‌ శ్రీ గురుతేజ అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్‌ వేశారు. ఈ పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అలోక్‌ ఆరాధే, జస్టిస్‌ ఎన్‌వి శ్రవణ్‌ కుమార్‌తో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. నాగర్‌కర్నూల్‌,  మోర్తాడ్‌, అమ్రాబాద్‌ ప్రాంతాల్లోని హాస్టళ్లలో ఇలాంటి ఘటనలు జరిగాయని పిటిషనర్‌ తరపు న్యాయవాది చిక్కుడు ప్రభాకర్‌ ధర్మాసనానికి తెలిపారు. జాతీయ బాలల హక్కుల  కమిషన్‌ రూపొందించిన మార్గదర్శకాలు… ఈ హాస్టళ్లలో పాటించడంలేదని అన్నారు. నాణ్యమైన ఆహారం లేకపోవడంతో రెసిడెన్షియల్‌ పాఠశాలలు, హాస్టళ్లలో విద్యార్థులు నరకయాతన అనుభవిస్తున్నారని.. మంచినీరు, కిచెన్‌, మరుగుదొడ్లలో పరిశుభ్రత లేక విద్యార్థులు కడుపు నొప్పి, తలనొప్పి, తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్నారని కోర్టుకు  తెలిపారు పిటీషనర్‌ తరపు లాయర్‌. అయితే… ఫుడ్‌ పాయిజన్‌ ఘటనలను అరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్నామని ప్రభుత్వ న్యాయవాది ముజీబ్‌ కుమార్‌ సదాశివుని  కోర్టుకు వివరించారు. ప్రభుత్వం హావిూ ఇచ్చిన తర్వాత కూడా ఫుడ్‌పాయిజన్‌ సంఘటనలు పదే పదే జరుగుతున్నాయని పిటిషన్‌ తరపు న్యాయవాది తెలిపారు. ఇరువర్గాల  వాదనలు విన్న హైకోర్టు ధర్మాసనం… అక్టోబరు 6లోగా హాస్టళ్లపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. నాగర్‌కర్నూల్‌ జిల్లాలోని బాలికల హాస్టల్‌లో 150 మందికి పైగా విద్యార్థులు రాత్రి భోజనం తిన్న తర్వాత అస్వస్థతకు గురయ్యారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందితోపాటు…  కడుపునొప్పితో బాధపడ్డారు. వారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. బాధిత విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో వచ్చిన అంబులెన్స్‌లు సరిపోలేదు. దీంతో కొంతమంది  విద్యార్థులను లారీ, ఆటో రిక్షాల్లో ఆస్పత్రికి తరలించారు. అస్వస్థతకు గురైన 150 మందిలో కొంతమంది విద్యార్థులలకు చికిత్స అందించి ఇంటికి పంపగా… మరికొందరికి  ఐసీయూలో చికిత్స అందించారు. హాస్టల్‌లో నీరు గానీ.. ఆహారం గానీ కలుషితం కావడం వల్లే… ఫుడ్‌పాయిజన్‌ జరిగిందని వైద్యులు అనుమానిస్తున్నారు. నిర్లక్ష్యంగా  వ్యవహరిస్తున్న హాస్టల్‌ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు కూడా డిమాండ్‌ చేస్తున్నాయి.తెలంగాణలోనూ కాదు దేశంలోని చాలా రాష్ట్రాల్లోని రెసిడెన్షియల్‌ హాస్టళ్లలో ఫుడ్‌ పాయిజన్‌ సంఘటన వెలుగుచూస్తున్నాయి. ఇటీవల.. మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌ గిరిజన హాస్టల్లోనూ దాదాపు 100 మంది విద్యార్థులకు ఫుడ్‌పాయిజన్‌ అయ్యింది. పిల్లలు వాంతులు చేసుకోవడంతో.. వెంటనే స్థానిక ఆస్పత్రికి  తరలించారు. ఫుడ్‌ పాయిజన్‌ జరగడానికి గల కారణాలపై దర్యాప్తు కొనసాగుతోంది. ఆహారం కలుషితమే తనడం వల్లే ఫుడ్‌పాయిజన్‌ అయ్యిందని అధికారులు ప్రాథమికంగా  అంచనా వేస్తున్నారు. నాసిరకమైన ఆహారం ఇస్తున్నారని ఫిర్యాదులు చేసినా సంబంధిత అధికారులు పట్టించుకోలేదన్న ఆరోపణలు ఉన్నాయి. హాస్టల్‌ యాజమాన్యం  నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై జిల్లా అధికారులు విచారణ చేపట్టారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....