హైదరాబాద్:ఫిబ్రవరి 27 (ఇయ్యాల తెలంగాణ) : లంగర్ హౌస్ లోని ఓ చికెన్ సెంటర్ వద్ద వెన్కాబ్ కంపెనీ డీలర్ కోడి మాంసం ప్రియులకు కంపెనీ ఆధ్వర్యంలో ఉచితంగా చికెన్ పకోడీ, ఉడకబెట్టిన గుడ్లను పంపిణీ చేశారు. కోళ్లకు వైరస్ సోకుతున్న నేపథ్యంలో వ్యాపారాలు జరగక యజమానులు ఇబ్బందులు పడుతున్నారు. అలాగే ప్రజలు కూడా భయభ్రాంతులకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ చికెన్ పకోడీ, గుడ్లను ఉచితంగా పంపిణీ చేయడం గమనార్హం. చికెన్ తింటే ప్రమాదమని తినడానికి ప్రజలు భయపడుతున్నారని, వారిలో అపోహ తొలగించడానికి ఉచితంగా పంపిణీ చేశామని డీలర్ చెప్పారు. వెన్కాబ్ కంపెనీ ఆధ్వర్యంలో 20 కేజీల చికెన్ పకోడీ, సుమారు 2వేల ఉడకబెట్టిన గుడ్లు పంపిణీ చేసినట్లు తెలిపారు. ఒక్కొక్కరికి రెండు గుడ్లు, 200 గ్రాముల చికెన్ పకోడీ పంపిణీ చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో కిరణ్ బాయిలర్ ట్రేడిరగ్ పార్ట్నర్ కె ఎస్ రెడ్డి పాల్గొన్నారు.
- Homepage
- iyyala telangana
- Free చికెన్ పకోడీ
Free చికెన్ పకోడీ
Leave a Comment