G.O. 317 పై ఏర్పాటైన క్యాబినెట్‌ సబ్‌ కమిటీ సమావేశం !

 


జీవో 317 పై ఏర్పాటైన క్యాబినెట్‌ సబ్‌ కమిటీ సమావేశం

దరఖాస్తులు చేసుకునే ఉద్యోగులకు జూన్‌ ` 30వ తేదీ వరకు అవకాశం

హైదరాబాద్‌ జూన్‌ 13 (ఇయ్యాల తెలంగాణ) : )Ñ జీవో 317 పై ఏర్పాటైన క్యాబినెట్‌ సబ్‌ కమిటీ గురువారం  సమావేశ మైంది.ఈ క్యాబినెట్‌ సబ్‌ కమిటీ సమావేశం లో కమిటీ చైర్మన్‌, రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ శాఖల మంత్రి దామోదర్‌ రాజనర్సింహ, సభ్యులు రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్‌ గార్లు పాల్గొన్నారు .  ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలను సబ్‌ కమిటీ ప్రకటించింది.  ఈ కమిటీ సమావేశంలో దరఖాస్తులు చేసుకునే ఉద్యోగులకు జూన్‌ ` 14 నుండి జూన్‌ ` 30వ తేదీ వరకు అవకాశం కల్పించడం జరిగింది.  ఈ సమావేశంలో వెబ్‌ సైటు ద్వారా దరఖాస్తులను లోకల్‌ స్టేటస్‌ ` ఆప్షన్‌ ఇవ్వడం జరిగింది.  కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల భార్య/భర్త లకు కూడా ఆప్షన్‌ ఇవ్వడం జరిగింది . మల్టిపుల్‌ అప్లికేషన్స్ల కు దరఖాస్తులకు అవకాశం కల్పించడం జరిగింది . ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న ఉద్యోగులకు రిసిప్ట్‌ ఇవ్వడం జరుగుతుంది.  ఇప్పటివరకు 12 వేల 11 దరఖాస్తులను వెబ్సైట్‌ ద్వారా స్వీకరించడం జరిగింది. ఈ దరఖాస్తులను రీ ` వెరిఫికేషన్‌ కు అవకాశం కల్పించడం జరిగింది.  ఉద్యోగులు ఆన్లైన్‌ ద్వారా  దరఖాస్తు చేసుకున్న తర్వాత ఆ దరఖాస్తు స్టేటస్‌ ను వారి సెల్‌ ఫోన్‌ కు మెసేజ్‌ ఇవ్వడం జరుగుతుంది. ఈ సబ్‌ కమిటీ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు శివశంకర్‌, రఘునందన్‌ రావు, జిఏడి అధికారులు పాల్గొన్నారు .

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....