Gajwel నుంచి ఈటెల పోటీ

మెదక్‌, ఆగస్టు12, (ఇయ్యాల తెలంగాణ) : రానున్న ఎన్నికల్లో ఈటెల రాజేందర్‌ గజ్వేల్‌ నుంచి పోటీ చేయించాలని బిజెపి అధిష్టానం యోచిస్తున్నట్టు తెలుస్తోంది.అధికారికంగా తెలంగాణ బిజెపి జాబితారానప్పటికీ ముఖ్యమంత్రి కెసీఆర్‌ స్వంత నియోజకవర్గం  గజ్వేల్‌ అసెంబ్లీ నియోజకవర్గం   నుంచి ఈటెలను నిలబెట్టాలని పార్టీ వర్గాలు యోచిస్తున్నట్టు సమాచారం. ఈటెల బీఆర్‌ఎస్‌ ను వీడి వేరే బిజెపిలో చేరడానికి గల కారణాలను కాసేపు  పక్కన పెడితే… అసలు కేసీఆర్‌ కి, ఈటలకు మధ్య ఇంత దూరం ఎందుకు వచ్చింది అనే విషయం ఇప్పటికీ ఇంకా ఎవరికీ అంతుబట్టడం లేదు. ఒకప్పుడు ఈటెల కెసీఆర్‌ కు అత్యంత సన్నిహితుడు. వైద్య, ఆరోగ్య శాఖ వంటి ప్రాధాన్యం ఉన్న శాఖను కేసీఆర్‌ ఈటెలకు కట్టబెట్టారు. ఎక్కడ తేడా వచ్చిందో తెలియదు గానీ సడెన్‌ గా మంత్రిపదవి నుండి తొలగించారు. ఈ పరిణామం ఈటెల వర్గీయుల్లో ఆందోళన నెలకొనేలా చేశాయి.  ఈటెల సైతం అదే స్థాయిలో  కేసీఆర్‌ పై యుద్ధాన్ని ప్రకటించారు.ఇది చాలా మందికి ఆశ్చర్యపరిచింది. రెండు దశాబ్దాల పాటు ఈటెల కేసీఆర్‌  అడుగులో అడుగు వేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ లో తెరాస శాసన సభా పక్ష నేతగా కూడా  ఈటెల పనిచేసారు. టిఆర్‌ఎస్‌ లో నమ్మిన బంటు ఈటెల. అటువంటిది ఆయన్ని పార్టీ నుంచి బయటకు పంపారు కెసీఆర్‌. వాస్తవంగా 2019లో ఈటెల చేసిన వ్యాఖ్యలు కెసీఆర్‌ ను ఇబ్బందుల్లో పడేసింది. 

గులాబీ జెండాకు యజమానులు ఎవరూ ఉండరనే వ్యాఖ్యలు దుమారం రేపాయి. టీఆర్‌ఎస్‌ పార్టీకి కార్యకర్తలే యజమానులు ఈటెల నర్మగర్భంగా చెప్పారు. టిఆర్‌ఎస్‌ పార్టీ ప్రయివేట్‌ లిమిటెడ్‌ కంపెనీగా మారిపోయిందని పలు సందర్భాల్లోఈటెల ఆరోపించారు. కుటుంబ పార్టీగా మారిపోయిందని ఈటెల విమర్శించారు. ఈ నేపథ్యంలో ఈటెల కుమార్తె పెళ్లి జరిగింది. ఆ పెళ్లికి ఇసుక వేస్తే రాలనంత జనం వచ్చారు. పార్టీ క్యాడర్‌ తో వివిధ పార్టీలకు చెందిన నేతలు పలువురు వచ్చారు.  కొందరు పనిగట్టుకుని ఈటల బలప్రదర్శనగా అభివర్ణించారు. ఆర్టీసీ సమ్మె విషయంలో కూడా ఈటల బాహాటంగా  కార్మికులకు మద్దతు ఇచ్చారు.ఈటెల , కేసీఆర్‌ తో ప్రత్యక్ష యుద్దానికి దిగినట్టయ్యింది. అప్పట్నుంచి ఈటెల వచ్చే ఎన్నికలలో  కేసీఆర్‌ ప్రాతినిద్యం వహిస్తున్నగజ్వేల్‌ నుంచి పోటీ చేస్తానని ప్రకటిస్తూ  వచ్చారు. ప్రత్యర్థి సిట్టింగ్‌ ఎమ్మెల్యే అయిన కేసీఆర్‌ ఉండకపోవచ్చన్న వార్తలు వినిపిస్తున్నాయి.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....