GHMC కమిషనర్‌గా ఆమ్రపాలి !

హైదరాబాద్‌ జూన్‌ 24 (ఇయ్యాల తెలంగాణ) :  రాష్ట్రంలో భారీగా ఐఏఎస్‌ల బదిలీలు జరిగాయి. ఒకేసారి 44 మంది అధికారులను ప్రభుత్వం ట్రాన్స్‌ఫర్‌ చేసింది. ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శిగా సుల్తానియాను నియమించింది. ఆయనకు ప్రణాళికశాఖ ముఖ్యకార్యదర్శిగా అదనపు బాధ్యతలు అప్పగించింది. పంచాయతీరాజ్‌, గ్రావిూణాభివృద్ధి ముఖ్యకార్యదర్శిగా కూడా ఆయన కొనసాగనున్నారు. ఈమేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి జీవో విడుదలచేశారు. జీహెచ్‌ఎంసీ కమిషనర్‌గా ఆమ్రపాలికి అదనపు బాధ్యతలు అప్పగించారు. ఇప్పటివరకు ఆ స్థానంలో కొనసాగిన రొనాల్డ్‌ రోస్‌ను విద్యుత్‌ శాఖ కమిషనర్‌గా ట్రాన్స్‌ఫర్‌ చేశారు. ఆయనకు జెన్‌కో, ట్రాన్స్‌కో సీఎండీగా అదనపు బాధ్యతలు కేటాయించారు.చేనేత, హస్తకళల ముఖ్యకార్యదర్శిగా శైలజా రామయ్యను బదిలీ చేశారు. ఆమెకు హ్యాండ్లూమ్స్‌, టీజీసీవో హ్యాండ్‌క్రాఫ్ట్స్‌ ఎండీగా అదనపు బాధ్యతలు అప్పగించారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....