GHMC పరిధిని పెంచవద్దు !

హైదరాబాద్‌, జూన్ 14 (ఇయ్యాల తెలంగాణ) : కాంగ్రెస్‌ ప్రభుత్వం హైదరాబాద్‌ జీహెచ్‌ఎంసీ పరిధిని పెంచే ప్రతిపాదనను బీజేపీ పార్టీ వ్యతిరేకిస్తుందని, తద్వారా రంగారెడ్డి జిల్లా ఉనికి దెబ్బతినే ప్రమాదం పొంచి ఉందని బీజేపీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు, బొక్క నర్సింహ్మారెడ్డి. రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షులు మల్లారెడ్డిలు అన్నారు. ఈ మేరకు హిమాయత్‌ నగర్‌ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ 21 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్స్‌ జీహెచ్‌ఎంసీ విలీనం చేయాలనీ చూస్తున్న కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రతిపాదనను వెనక్కి తీసుకోవాలని వారు డిమాండ్‌ చేశారు.  జీహెచ్‌ఎంసీ పరిధిని పెంచాలనే ప్రభుత్వ ప్రతిపాదనను తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని వారు అన్నారు.

 కాంగ్రెస్‌ ప్రభుత్వం ముస్లింల ప్రాబల్యం కొనసాగడానికి జిహెచ్‌ఎంసిలో మున్సిపాలిటీలను, కార్పొరేషన్లు విలీనం చేయడానికి అధికారులు పూనుకుంటున్నారని ఆరోపించారు. జీహెచ్‌ఎంసీ పరిధిని విస్తరిస్తే హైదరాబాద్‌ చుట్టు ఉన్న గిరి, మేడ్చెల్‌ జిల్లాలో అభివృద్ధి కుంటుపడుతుందని అన్నారు. చెరువులు, కుంటలు కబ్జాలకు గురైయ్యే ప్రమాదం ఉందన్నారు. గతంలో జీహెచ్‌ఎంసీ ఏర్పాటు చేసేముందు తాము వ్యతిరేకించామని వారు అన్నారు. ప్రభుత్వం పన్నులు వసూలు చేసేందుకు, మజ్లిస్ను సంతృప్తి పరిచేందుకు ఈ నిర్ణయం తీసుకుందని వారు ఆరోపించారు. ఈ నిర్ణయం రాజకీయకోణం మాత్రమే అన్నారు. ఈ అశాస్త్రీయమైన నిర్ణయాన్ని ప్రజలు వ్యతిరేకిస్తున్నారని అన్నారు. గతంలో జీహెచ్‌ఎంసీని ఏర్పాటు చేసి హైటెక్‌ సిటీ లాంటి ప్రాంతాలను మాత్రమే అభివృద్ధి చేసి హైదరాబాద్ను అభివృద్ధి చేశామని చెప్పారాని విమర్శించారు. జిహెచ్‌ఎంసీల విలీనం వల్ల ప్రజలకు ఎలాంటి ప్రయోజనం లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌ జీహెచ్‌ఎంసీని విస్తరించే మానుకోవాలని లేని పక్షంలో అన్ని రాజకీయ పార్టీలని కలుపుకుని అడ్డుకుంటామని, దీంతో పాటు లీగల్గా ఎదుర్కొంటామని వారు హెచ్చరించారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....