GHMC – మేయర్‌, కమిషనర్‌ మధ్య పెరిగిన దూరం

హైదరాబాద్‌, ఫిబ్రవరి 6, (ఇయ్యాల తెలంగాణ) : గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి, కమిషనర్‌ రోనాల్డ్‌ రోస్‌ మధ్య కోల్డ్‌ వార్‌ నడుస్తోంది. ఎన్నికల ముందు నుంచి మేయర్‌, కమిషనర్‌లు ఎడమొహం పెడమొహంగా ఉన్నారు. స్టాండిరగ్‌ కవిూటి గడువు ముగిసినా ఇప్పటికీ నోటిఫికేషన్‌ ఇవ్వలేదు. పాలకమండలి సమావేశంపై సైతం నిర్వహించకపోవడం చూస్తూంటే ఇద్దరి మధ్య మరింత దూరం పెరిగిందనటానికి నిదర్శనంగా కనిపిస్తోంది.గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ కోటి మందికి పైగా సేవలు అందిస్తున్న సంస్థ. ఉదయం లేచింది మొదలు రాత్రి వరకు సిటిజన్స్‌కు అనేక ఫెసిలిటీస్‌ను కల్పిస్తోంది బల్దియా. బర్త్‌ సర్టిఫికెట్‌ నుంచి మొదలుకొని డెత్‌ సర్టిఫికెట్‌ వరకు పలు సేవలు అందిస్తోంది. అయితే అలాంటి జీహెచ్‌ ఎంసీలో అధికారులు ప్రజాప్రతినిధుల మధ్య సమన్వయం కొరవడుతుంది. గత ప్రభుత్వంలో మంత్రి కేటీఆర్‌ అన్ని తానై బల్దియాలో పనులు చేసేవారు. ఏ నిర్ణయమైనా మంత్రికి తెలియకుండా జరిగేది కాదన్న విమర్శలున్నాయి. అయితే ఇప్పుడు ప్రభుత్వం మారడంతో మేయర్‌, కమిషనర్‌ ఎడమొహం, పెడమొహంగా ఉన్నట్లు తెలుస్తోంది.జీహెచ్‌ఎంసీలో పాలకమండలి ఉన్నప్పుడు ప్రతి నిర్ణయం మేయర్‌, కమిషనర్‌ , పాలకమండలి సంయుక్తంగా తీసుకోవాలి. కానీ ఎన్నికల ముందు లోకేష్‌ కుమార్‌ను మార్చి కొత్తగా రోనాల్డ్‌ రోస్‌ ను కవిూషనర్‌ గా నియమించింది ప్రభుత్వం. మొదట్లో కొన్ని రోజులు అంతా సవ్యంగానే సాగినప్పటికీ ఎన్నికల హాడావిడి మొదలు కావడం, తరువాత ప్రభుత్వం మారడంతో కమిషనర్‌ ఎకపక్షంగా వ్యవహరిస్తున్నరని బీఆర్‌ఎస్‌ కార్పొరేటర్లు అంటున్నారు. నవంబర్‌ 13న స్టాండిరగ్‌ కమిటీ సభ్యుల గడువు ముగిసింది. అసెబ్లీ ఎన్నికలు నేపథ్యంలో వాటిని నిర్వహించలేదు. అవి పూర్తి అయి రెండు నెలలు కావస్తున్న ఇప్పటికి స్టాండిరగ్‌ కమిటీ ఎర్పాటుపై కమిషనర్‌ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.దీంతో మేయర్‌ చెప్పినా అధికారులు పట్టించుకోవడం లేదని బిఆర్‌ఎస్‌ కార్పోరేటర్లు అరోపిస్తున్నారు. ఇక ప్రతి మూడు నెలలకొకసారి జీహెచ్‌ఎంసీ పాలకమండలి నిర్వహించాలని చట్టం చెబుతోంది, కానీ ఆగస్టులో జరిగిన సమావేశం ఇప్పటికీ జరగడం లేదు. మేయర్‌ కార్యాలయం సమావేశం ఏర్పాటు చేయాలని చెప్పినా కమిషనర్‌ స్పందించడం లేదని బీఆర్‌ఎస్‌ ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్‌ రెడ్డిని మేయర్‌ విజయలక్ష్మి కలవడం ఈ కోల్డ్‌ వార్‌ నిజమని ప్రచారం జరుగుతోంది. స్టాండిరగ్‌ కమిటీ ఏర్పాటు, కౌన్సిల్‌ సమావేశం ఏర్పాటు చేయడంపై బల్దియా కమిషనర్‌ కు చెప్పిన పట్టించుకోవడం లేదని మేయర్‌ నేరుగా సీఎం రేవంత్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో ప్రభుత్వం జోక్యం చేసుకొని ఈ ఇద్దరి మధ్య కోల్డ్‌ వార్‌కు చెక్‌ పెడుతుందా వేచి చూడాలి.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....