GHMC లో ఎంటమాలజిస్ట్‌ దోమల పేరుతో దోపిడీ ! ‘’మచ్చర్‌ కహానీ’’

హైదరాబాద్‌, ఆగస్టు 6, (ఇయ్యాల తెలంగాణ) : దోమల నివారణే దోపిడీ మార్గంగా ఎంచుకున్న ఓ ఆఫీసర్‌ స్టోరీ ఇది. ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులను జలగలా పీడిస్తూ అక్రమార్జనే ధ్యేయంగా పని చేస్తున్న ఓ అవినీతి దోమ ‘’మచ్చర్‌ కహానీ’’ ఇది. చేయని ఫాగింగ్‌ కు ఫ్యూయల్‌ (పెట్రోల్‌, డీజిల్‌) బిల్లింగ్స్‌ తో ప్రభుత్వ ఖజానాకు సీనియర్‌ ఎంటమాలజిస్ట్‌ సంధ్య గండి కొడుతున్నారు. ఫాగింగ్‌ యూనిట్ల నుంచి బలవంతపు వసూళ్లు చేస్తున్నారు. డబ్బులు ఇవ్వాల్సిందే అంటూ హూంకరిస్తున్న సీనియర్‌ ఎంటామలజిస్ట్‌ సంధ్య ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల నుంచి బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్నారు. విూరు ఏం చేస్తారో తెలీదు, నాకు మాత్రం డబ్బు ఇవ్వాల్సిందేనని ఆర్డర్‌ వేస్తున్నారు. ఆఫ్ట్రాల్‌ విూరు ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు. నా మాట వినకుంటే మిమ్మల్ని ఉద్యోగంలోంచి తీసేస్తానని బెదిరించారు. దీంతో గత్యంతరం లేక ఆమె అడిగిన మొత్తాన్ని సమర్పించుకుంటున్నారు. గతంలో సంధ్యపై ఇలాంటి ఆరోపణలు ఎన్నో ఉన్నాయి. వరంగల్‌ కార్పొరేషన్‌ లోనూ డీజిల్‌ అక్రమాలు, బెదిరింపుల కారణంగానే గతంలో సంధ్య సస్పెండ్‌ అయ్యారు. అయినా ఆమె తీరులో మార్పు లేదు. తాజాగా జీహెచ్‌ఎంసీలో ఆమె బలవంతపు వసూళ్లు తెరపైకి వచ్చాయి. సీనియర్‌ ఎంటమాలజిస్ట్‌ సంధ్య ఉద్యోగి నుంచి డబ్బులు తీసుకుంటున్న దృశ్యాలు కెమెరాకు చిక్కాయి.

👉 దోమల నివారణే దోపిడీ మార్గం

👉 జీహెచ్‌ఎంసీలో సీనియర్‌ ఎంటమాలజిస్ట్‌ సంధ్య లీలలు

👉 చేయని ఫాగింగ్‌ కు పెట్రోల్‌, డీజిల్‌ బిల్లులు

👉 ఫాగింగ్‌ యూనిట్ల నుంచి బలవంతపు వసూళ్లు

👉 ఒక్కో సర్కిల్‌ నుంచి రూ.30వేలు వసూలు

👉 ఆమె పరిధిలో మొత్తం 9 సర్కిళ్లు

👉 ఎన్నికల సమయంలో 10 రోజుల్లో జీహెచ్‌ఎంసీ ఖజానాకు దాదాపు రూ.2లక్షలు నష్టం

👉 ప్రతి నెల టార్గెట్‌ ఫిక్స్‌ చేసి ఏఈల నుంచి డబ్బులు వసూలు

👉 డీజిల్‌, పెట్రోల్‌ వాడకంలో కోత

👉 ఆ మొత్తాన్ని తన ఖాతాలో వేసుకుంటున్న ఆఫీసర్‌

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....