Government పాఠశాలల విద్యార్థులకు రోటరీ క్లబ్‌ ఆధ్వర్యంలో స్టీలుప్లేట్ల పంపిణీ

నంద్యాల, సెప్టెంబర్ 16 (ఇయ్యాల తెలంగాణ) : గ్రామంలోని గవర్నమెంట్‌, ఉర్దూ, స్పెషల్‌ పాఠశాలల విద్యార్థినీ, విద్యార్థుల భోజన సదుపాయానికి స్టీలు ప్లేట్లు క్లబ్‌ సభ్యులైన గొల్ల జయకృష్ణ, భవనాసి లక్ష్మీనారాయణ, కొల్లి వేణుగోపాల్‌ సహాయ సహకారాలతో వితరణ చేయడం జరిగిందని రోటరీ క్లబ్‌ ఆఫ్‌ నంద్యాల అధ్యక్షులు దండే దస్తగిరి తెలిపారు. ఈ సందర్భంగా దండే దస్తగిరి మాట్లాడుతూ అన్ని రంగాలలో రోటరీ క్లబ్‌ ఆఫ్‌ నంద్యాల తరఫున సేవా కార్యక్రమాలు విస్తరిస్తామని తెలిపారు. క్లబ్‌ పి.డి.జి శ్రీరామ్‌ మూర్తి, విజయ శేఖర్‌ రెడ్డి మాట్లాడుతూ కానాల గ్రామంలోని గవర్నమెంట్‌, ఉర్దూ పాఠశాలలను ఎంపిక చేసుకుని విద్యార్థినీ విద్యార్థుల భోజన సదుపాయానికి స్టీల్‌ ప్లేట్లు అందించిన రోటరీ క్లబ్‌ సభ్యుల సేవలు  అభినందనీయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో క్లబ్‌ సెక్రటరీ సుధా ప్రసాద్‌ రెడ్డి, కోశాధికారి బాలకృష్ణ, సుబ్బరామయ్య, పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, గ్రామ ప్రజలు పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయడం జరిగింది.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....