జయశంకర్ భూపాలపల్లి, జూన్ 05 (ఇయ్యాల తెలంగాణ) : ప్రభుత్వ అభివృద్ధి పనులకు, నిర్మాణాలకు ఇసుక తరలింపుకు అనుమతులు ఇవ్వాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. బుధవారం జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా కాటారం మండలంలోని విలాసాగర్ గ్రామ సవిూపంలోని మానేరు నది ఇసుక రీచ్ ను పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన సంబందిత అధికారులతో మాట్లాడుతూ కాటారం మండలంలోని పలు ప్రభుత్వ అభివృద్ధి పనుల రీత్యా ఇసుక రవాణా కోసం విలాసాగర్ గ్రామ సవిూపంలోని మానేరు నది నుండి ఇసుక రవాణాకు అవకాశం ఇవ్వాలని అన్నారు. 5 హెక్టార్ల కు గాను నీటి సామర్ధ్యాన్ని పరిశీలించి నివేదికలు అందచేయాలని భూ గర్భ జలవనరుల శాఖ అధికారిని ఆదేశించారు . ఇందుకు గాను మొత్తం 12.5 ఎకరాలకు ఒక బౌండరిని ఏర్పాటు చేయాలని ఇరిగేషన్, రెవెన్యూ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఏదైనా కాంట్రాక్ట్ పనులకు గాని ఇతరత్రా ప్రయివేట్ నిర్మాణాలకు కానీ ఇసుక రవాణాకు అనుమతులు ఇచ్చినా, అక్రమంగా ఇసుక రవాణా చేసినా కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. నూతన ఇసుక రీచ్ లు ఏర్పాటుకు కావలసిన అనుమతులు, ఈసి లను సిద్ధం చేసి త్వరితగతిన నివేదికలు అందజేయాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మైనింగ్ అధికారి జయరాజు, భూ గర్భ జలవనరుల అధికారి శ్రీనివాసరావు, కాటారం తహసిల్దార్ నాగరాజు, ఇరిగేషన్ ఏఈ లు తదితరులు పాల్గొన్నారు.