Gowlipura ఆలే నరేంద్ర ప్లే గ్రౌండ్ లో ముద్గార్ ఛాలెంజ్

హైదరాబాద్, మే 07 (ఇయ్యాల తెలంగాణ) : గౌలిపురలోని ఆలే నరేంద్ర ప్లే గ్రౌండ్ లో  ముద్గార్ ఫిట్నెస్ ఛాలెంజ్ నిర్వహించారు. ధూల్ పేట్ ముద్గార్ బలవీర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ ఛాలెంజ్ ను స్వీకరించడానికి అనేక మంది ఔత్సాహికులు, క్రీడా కారులు ముందుకు వచ్చారు. కొందరు కొద్దీ నిముషాలకే అయ్యో అన్నట్లు కాగా మరికొందరు కొన్ని నిముషాల పాటు ముద్గార్ ను చేత బట్టి భేష్ అనిపించుకోవడంలో నిష్ణాతులైనారు. ఛాలెంజ్ ను స్వీకరించి భేష్ అనిపించుకున్న పలువురు ఔత్సాహికులను గౌలిపురా డివిజన్ మాజీ కార్పొరేటర్ ఆలే జితేంద్ర అభినందించారు. వారికి, ప్రశంసలు అందజేశారు. తాతల కాలం నాటి దంగల్ వ్యవస్థను ఇప్పటి యువతరం ఆదర్శంగా తీసుకొని బలవంతులుగా తయ్యారవ్వాలని ఆలే జితేంద్ర కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్. మహేష్ బాబు, ఉదయ్ కుమార్, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. 

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....