Gowlipura మిత్ర గ్రౌండ్ లో నేతాజీకి నివాళులు

 

గౌలిపూర, జనవరి 23 (ఇయ్యాల తెలంగాణ) :  నేతాజీ సుభాష్ చంద్రబోస్ 127 వ జయంతి  వేడుకలను పురస్కరించుకొని గౌలిపురా మిత్ర గ్రౌండ్లో  బాక్సింగ్ కోచ్ సత్యనారాయణ ఆధ్వర్యంలో  ఏర్పాటు చేసిన నేతాజీ జయంతి వేడుకల్లో పలువురు ప్రముఖులు నేతాజీ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా ఆయన చేసిన సేవలను కొనియాడారు. మిత్ర గ్రౌండ్ ప్రెసిడెంట్ మాట్లాడుతూ నేతాజీ మార్గంలో నేటి  యువత ముందుకు నడవాలని పిలుపునిచ్చారు. దేశం కోసం పోరాడిన వీరుల గాథలు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని యువత వారిని అనుసరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఓల్డ్ సిటీ  బాక్సింగ్ కోచ్ సత్యనారాయణ తో పాటు, ఫిల్మ్ స్టార్ అందె కృష్ణారావు,ఆర్.ముత్యం,జీవన్ పలువురు క్రీడాకారులు పాల్గొని నేతాజీకి నివాళులర్పించారు. 

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....