Grand గా బ్రాహ్మణి ముత్యాలమ్మ Mata పండగ మహోత్సవం

ఘనంగా బ్రాహ్మణి ముత్యాలమ్మ తల్లి పండగ మహోత్సవం

` అన్నసమారాధన కార్యక్రమంలో భారీగా పాల్గొన్న భక్తులు

పరవాడ, మే 23 (ఇయ్యాల తెలంగాణ) : మండల కేంద్రం అయ్యిన పరవాడ గ్రామంలో కొలువై ఉన్న శ్రీ శ్రీ శ్రీ బ్రాహ్మణి ముత్యాలమ్మ తల్లి అమ్మవారి పండగ మహోత్సవం గురువారం నాడు ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచి అమ్మవారికి పురోహితులుచే ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయం వద్ద ధర్శనం కోసం వచ్చిన భక్తులు కోసం ప్రత్యేకంగా ప్రసాదాలు ఏర్పాటు చేశారు అలాగే మధ్యాహ్నం అమ్మవారు ఆలయం వద్ద భక్తుల సహాయంతో భారీ అన్న సమారాధన కార్యక్రమం ఏర్పాటు చేశారు. సాయంత్రం గ్రామంలో అమ్మవారి ప్రతిమను భారీ మందుగోడు సామాగ్రితో గ్రామ పురావిధిలలో ఊరేగించి పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు పయిల రామచంద్రరావు,చీపురుపల్లి సన్యాసిరావు,పిల్లా జగదీష్‌,పయిల సన్యాసి నాయుడు, అక్కునాయుడు,సింహాచలం నాయుడు,రాజాన సత్యం తదితరులు పాల్గొన్నారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....