Greater రేషన్‌ కార్డుల దందా !

హైదరాబాద్‌, జూన్‌4, (ఇయ్యాల తెలంగాణ) : రేషన్‌ కార్డుల కోసం ఇప్పుడు ప్రజలు విూ సేవా కేంద్రాలకు క్యూ కడుతున్నారు. ఇదే అదునుగా భావించిన పౌరసరఫరాల అధికారులు డబ్బుల వసూళ్లకు పాల్పడుతున్నారు. కాంగ్రెస్‌ పాలనలో 30 శాతం కవిూషన్లు ఇస్తేనే పనులు చేస్తున్నారంటూ పలువురు రాష్ట్ర మంత్రులపై ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో మేమేం తక్కువ తిన్నామా అంటూ కొందరు అధికారులు సైతం వారిని ఆదర్శంగా తీసుకొని అవినీతి దందాకు తెరలేపారు. ప్రతి రోజూ అందినకాడికి దండుకుంటున్నారు. రెండు మూడు రోజుల్లోనే కొత్త రేషన్‌ కార్డులు ఇప్పిస్తామని కొందరు సివిల్‌ సప్లై ఉద్యోగులతో పాటు పలువురు దళారులు భారీగా వసూళ్లకు పాల్పడుతున్నారనే అరోపణలు వెల్లువెత్తు తున్నాయి.రాష్ట్రంలో ఏ సంక్షేమ పథకానికి దరఖాస్తు చేసుకోవాలన్నా కావాల్సింది ప్రధానంగా రేషన్‌ కార్డు. ప్రతి పేద, నిరు పేద, మధ్యతరగతి కుటుంబాల్లో ప్రతిష్టాత్మకంగా రేషన్‌ కార్డు అనేది అవసరం. అయితే కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి రేషన్‌ కార్డు ఇవ్వాలనే ఉద్దేశంతో విూసేవ సెంటర్ల ఆన్‌లైన్‌ చేసుకొని పౌరసరఫరాల కార్యాలయాల్లో వాటిని వెరిఫికేషన్‌ చేసి వెంటనే కార్డు మంజూరు చేయాలని ప్రభుత్వం చెబుతుంటే దీనికి భిన్నంగా పౌరసరఫరాల అధికారులు వ్యవహరిస్తున్నారు. కొత్త రేషన్‌ కార్డుల కోసం గత ఏడాది నిర్వహించిన ప్రజా పాలన కార్యక్రమంలో దరఖాస్తులు స్వీకరించారు. వాటి విచారణను మాత్రం పౌరసరఫరాల అధికారులు జీహెచ్‌ఎంసీకి అప్పగించించారు. కొత్తగా కార్డు కావాలనుకునే వారు విూ సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించినా ప్రజా పాలనలో దరఖాస్తు చేసుకున్న వారు ఆన్‌ లైన్‌ లో దరఖాస్తు చేసుకునే అవసరం లేదంటూ అప్పట్లో అధికారులు ప్రకటించారు. అయితే రెండు శాఖల అధికారుల సమన్వయ లోపంతో తీరా ప్రజా పాలన దరఖాస్తులను పక్కన పెట్టి జీహెచ్‌ఎంసీ అధికారులు చేతులెత్తేశారు. దీంతో ప్రజా పాలనలో దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులు కూడా తాజాగా మరో సారి విూ సేవా కేంద్రాల్లో దరఖాస్తులు చేసుకోవాలని అధికారులు ప్రకటించారు. దీంతో గతంలో ప్రజా పాలనలో దరఖాస్తు చేసుకున్న కుటుంబాలతో పాటు కొత్తగా రేషన్‌ కార్డు కావాలనుకునే వారు, కార్డులో మార్పులు చేర్పులు చేసుకునే వారు విూ సేవా కేంద్రాలకు క్యూ కడుతున్నారు. అయితే వీరిది అవసరం..ఇదే మనకు అవకాశంగా భావించిన కొంత మంది పౌరసరఫరాల అధికారులు కొందరు దళారుల అండతో అక్రమంగా డబ్బుల వసూళ్లకు పాల్పడుతూ భారీ అవినీతికి తెరలేపారని సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి.

కొత్త రేషన్‌ కార్డుల మంజూరులో ఏరియా సివిల్‌ సప్లై ఇన్‌ స్పెక్లర్లు కీలకంగా మారారు. దీంతో అంబర్‌ పేట సర్కిల్‌ పరిధిలోని అంబర్‌ పేట డివిజన్‌ పరిధిలోకి వచ్చే 2 ?3 ఇంటి నంబర్లకు సంబంధించిన విచారణ అధికారిగా విధులు నిర్వహిస్తోన్న ఓ సివిల్‌ సప్లై ఇన్‌ స్పెక్టర్‌ అవినీతికి పాల్పడుతున్నాడని ఆరోపణలు ఉన్నాయి. సదరు అధికారి కొత్త రేషన్‌ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న కుటుంబాల ఇంటి వెళ్లి క్షేత్ర స్థాయిలో విచారణ జరిపి అసలైన అర్హులను గుర్తించి వారికి కొత్త రేషకార్డులను మంజూరు చేయాల్సి ఉంటుంది?కానీ అతను అంబర్‌ పేట పటేల్‌ నగర్‌ హనుమాండ్ల గుడి వద్ద ఓ వారం రోజుల పాటు క్యాంపు ఏర్పాటు చేసుకొని తూతూ మంత్రంగా విచారణ చేపట్టి వదిలేశాడని పలువురు ఆరోపిస్తున్నారు. ఇక దరఖాస్తు చేసుకున్న వారి ఇంటికి విచారణ పేరుతో వెళ్లి ఏదో కారణం చూపిస్తూ విూకు కార్డు రాదంటూ బయపెడుతున్నారని దీంతో చేసేది ఏవిూ లేక రూ.వెయ్యి లంచం ఇచ్చుకోక తప్పడం లేదని పలువురు పేరు తెలపడానికి ఇష్ట పడని అర్హులైన పలువురు లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

లంచం ఇచ్చే వారి పట్ల ప్రేమగా ఉంటూ .. నెలలు గడిచినా ఇంకా కొత్త కార్డు రాలేదని అర్హులైన దరఖాస్తు చేసుకున్న సామాన్య ప్రజలు సర్కిల్‌ కార్యాలయం వద్దకు వెళితే బెదిరింపులకు పాల్పడుతూ సరైన సమాధానం చెప్పకుండా వారి పట్ల దురుసుగా ప్రవర్తిస్తున్నారని పలువురు దరఖాస్తుదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.. ఇదిలా ఉంటే కాంగ్రెస్‌ పాలనలో ఇది కామనే ?అంటూ ప్రజలు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు.ఈ అక్రమ దందాలో పలు పార్టీల నాయకులతో పాటు తాడు, బొంగరం, ఊరు పేరు లేని పొట్ట చీల్చితే అక్షరం రాని కొందరు విలేకరులు కూడా దళారులుగా మారి అందిన కాడికి దండుకుంటున్నారు. కొత్త రేషన్‌ కార్డు వెంటనే ఇప్పిస్తామంటూ సదరు దళారులు విూ సేవా కేంద్రాల్లో నమోదు చేసిన దరఖాస్తులను లబ్ధిదారుల వద్ద తీసుకుని వారి వద్ద రూ.2వేల వరకు వసూళ్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. వీరు అంబర్‌ పేట డివిజన్‌ సివిల్‌ సప్లై ఇన్‌ స్పెక్టర్‌ తో కుమ్మక్కై ఓ ఒప్పందం కుదర్చుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. లబ్ధిదారుల వద్ద తీసుకున్న డబ్బుల్లో రూ.వెయ్యి ఇన్‌ స్పెక్టర్‌ కు లంచంగా ఇవ్వడంతో అదే రోజు అనర్హులైనా ఎలాంటి విచారణ చేయకుండా వాటిని క్లియరెన్స్‌ చేస్తున్నట్లు ఆరోపణలు సైతం ఉన్నాయి. దీంతో వారికి కేవలం రెండు రోజుల్లోనే కొత్త కార్డులు మంజూరు అవుతున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే కొంతమంది నెలలు గడిచినా రేషన్‌ కార్డు మంజూరు కాకపోవడంతో తమకు కార్డు వస్తుందో ..రాదో అంటూ ఆందోళన చెందుతున్నారు. డబ్బులు తీసుకొని రేషన్‌ కార్డులు మంజూరు చేసే అధికారుల పైన ఉన్నతాధికారులు చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలని రేషన్‌ కార్డు లబ్ధిదారులు కోరుతున్నారు

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....