Green Card అందకుండానే అసువులు బాయనున్న 4లక్షల మంది భారతీయులు

న్యూఢిల్లీ, సెప్టెంబర్‌ 6  (ఇయ్యాల తెలంగాణ) :అమెరికా జారీ చేసే గ్రీన్‌ కార్డు కోసం ప్రతి ఏడాది లక్షల సంఖ్యలో వలసదారులు వేచి చూస్తుంటారు. అయితే ఆ కార్డు జారీలో జరుగుతున్న ఆలస్యం వల్ల .. సుమారు నాలుగు లక్షల మంది భారతీయులు ఆ కార్డును అందుకోకుండానే ప్రాణాలు విడిచే అవకాశాలు ఉన్నట్లు ఓ రిపోర్టులో తేలింది. అమెరికాకు చెందిన క్యాటో ఇన్స్‌టిట్యూట్‌ ఇచ్చిన నివేదిక ప్రకారం ఈ విషయం వెల్లడైంది. అమెరికా ఎంప్లాయిమెంట్‌ ఆఫీసు వద్ద గ్రీన్‌ కార్డు కోసం సుమారు 11 లక్షల మంది భారతీయుల దరఖాస్తులు పెండిరగ్‌లో ఉన్నాయి. అయితే వారందరికీ ఇప్పట్లో కార్డు అందడం అసాధ్యంగా కనిపిస్తోంది. అమెరికా ఎంప్లామెంట్‌ శాఖ వద్ద మొత్తం 18 లక్షల గ్రీన్‌ కార్డు దరఖాస్తులు పెండిరగ్‌లో ఉన్నాయని, దాంట్లో 63 శాతం దారఖాస్తులు భారతీయులవే అని తెలుస్తోంది. వీటికి తోడు ఫ్యామిలీ సిస్టమ్‌తో లింకు ఉన్న గ్రీన్‌ కార్డులు సుమారు 83 లక్షల వరకు పెండిరగ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది.క్యాటో ఇన్స్‌టిట్యూట్‌ ఇచ్చిన రిపోర్టు ప్రకారం.. కొత్తగా గ్రీన్‌కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న భారతీయులకు.. వెయిటింగ్‌ అనేది ఓ జీవితకాల శిక్షగా మారనున్నట్లు చెప్పింది. ప్రస్తుతం ఆ శాఖ వద్ద ఉన్న దరఖాస్తుల్ని క్లియర్‌ చేయాలంటే దాదాపు 134 ఏళ్లు పడుతుందట. ఇక సుమారు 4,24,000 మంది గ్రీన్‌ కార్డు కోసం ఎదురూచూస్తూ తమ ప్రాణాల్ని కోల్పోయే ప్రమాదం ఉందని, దీంట్లో 90 శాతం మంది భారతీయులే ఉన్నట్లు రిపోర్టులో తెలిపారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....