గతేడాది 503 గ్రూప్`1 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడిన సంగతి తెలిసిందే. అయితే ఈ పోస్టులకు మరిన్ని పోస్టులు కలిపితే మొత్తం ఖాళీల సంఖ్య 600 వరకూ ఉండే అవకాశం ఉంది. అదనపు పోస్టులకు సంబంధించి సప్లిమెంటరీ నోటిఫికేషన్ ఇవ్వాలని టీఎస్?పీఎస్పీ యోచిస్తోంది. ఈ క్రమంలో సప్లిమెంటరీ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసే పోస్టులకు గతంలో దరఖాస్తు చేసిన వారితో పాటు కొత్త వారికి అవకాశం ఇవ్వాలని భావిస్తోంది. అయితే, కొత్తగా దరఖాస్తు చేసేవారు మాత్రం కొత్త పోస్టులకు మాత్రమే అర్హులుగా ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో గ్రూప్`2కు ఇలాగే చేసినట్లు టీఎస్?పీఎస్సీ వర్గాలు అంటున్నాయి. ఒకవేళ ఈ నిబంధనను మార్చాలనుకుంటే సర్కారు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది.
సుప్రీంకోర్టు నుంచి కేసు వెనక్కి!
తెలంగాణ ఏర్పడిన తర్వాత తొలిసారిగా గతేడాది అక్టోబరు 16న తొలిసారి ప్రిలిమ్స్ నిర్వహించారు. తరువాత ప్రిలిమ్స్ ప్రశ్నపత్రాల లీకేజీ కుంభకోణం వెలుగుచూడటంతో కమిషన్ ఆ పరీక్షను రద్దు చేసింది. తరువాత మళ్లీ ఈ ఏడాది జూన్ 11న ప్రిలిమ్స్ నిర్వహించింది. టీఎస్పీఎస్సీ వీరి నుంచి 1:50 నిష్పత్తిలో 25 వేల మందిని ఈ ఏడాది జనవరిలో మెయిన్స్‌కు ఎంపిక చేసింది. జూన్‌లో ప్రధాన పరీక్షలు నిర్వహించేందుకు షెడ్యూలు వెలువరించింది. అనూహ్యంగా ప్రిలిమ్స్ ప్రశ్నపత్రాల లీకేజీ కుంభకోణం వెలుగుచూడటంతో కమిషన్ ఆ పరీక్షను రద్దు చేసింది. తిరిగి జూన్ 11న ప్రిలిమ్స్ నిర్వహించగా 2,33,506 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఈ పరీక్షను కూడా కోర్టు రద్దు చేసింది. అయితే ఈ తీర్పుపై టీఎస్పీఎస్సీ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ప్రస్తుతం దీనిపై కేవియెట్ పిటిషన్ కూడా వేశారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టులో ముందుకు పోతే, తీర్పు రావడం ఆలస్యమైతే ఎలా అనే ఆందోళన కమిషన్ లో నెలకొన్నది. ఈ నేపథ్యంలో కేసును విత్ డ్రా చేసుకొని, మళ్లీ పరీక్ష పెట్టాలని యోచిస్తున్నట్టు తెలుస్తోంది.