HIGH COURT BENCH కర్నూలుకు తెస్తా..

కర్నూలు ఆగష్టు 18, ఇయ్యాల తెలంగాణ ; తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆరు నెలల్లోపు హైకోర్టు బెంచ్‌ కర్నూలుకు తీసుకువస్తామని కర్నూలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంఛార్జీ టిజి భరత్‌ అన్నారు. కర్నూలు నగరంలోని 22వ వార్డు అరోరా నగర్లో ఆయన భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమం పేరుతో ఇంటింటికి వెళ్లి ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ప్రజలు అర్హులైనా పింఛన్‌ అందడం లేదని చెప్పారు. మోడల్‌ స్కూల్‌ లో పని చేస్తున్నందుకు సంక్షేమ పథకాలు ఇవ్వడం లేదన్నారు. నిత్యావసర సరుకుల రేట్లు పెరిగిపోయి తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నామన్నారు. ఈ సందర్భంగా టిజి భరత్‌ మాట్లాడుతూ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు నాయకత్వం  ఎంతో అవసరమని చెప్పారు. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తామని హావిూ ఇచ్చారు. టిడిపి మొదటి విడత మేనిఫెస్టోలో ప్రజలకు ఎంతో ఉపయోగపడే సంక్షేమ, అభివృద్ధి అంశాలు ఉన్నాయని వివరించారు. చంద్రబాబు నాయుడు విజనరీ లీడర్‌ అన్నారు. తనని కర్నూలు ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఐదేళ్లు మంచిగా పరిపాలన అందిస్తానని చెప్పారు. గెలిపించిన తర్వాత కర్నూలును తాను అభివృద్ధి చేయకపోతే 2029 ఎన్నికల్లో పోటీలో కూడా ఉండనని స్పష్టం చేశారు. ఒక్క అవకాశం ఇచ్చి తన పనితీరు చూడాలని ప్రజలను కోరారు. తాను గెలిచిన తర్వాత కర్నూల్‌ ప్రజలు పడుతున్న ఇబ్బందులు తీర్చేస్తానని భరోసా ఇస్తూ తన పర్యటన కొనసాగించారు. ఈ కార్యక్రమంలోటిడిపి నేతలు శ్రీధర్‌, చంద్రశేఖర్‌, సాయి, సూర్యప్రకాష్‌, వంశీ, మురళీకృష్ణ, ప్రవీణ్‌ , గీత, వనిత, రంగనాథ్‌, పుష్పాలత, రామేశ్వరి, లలితమ్మ విష్ణు, వసంత లక్ష్మి, భాస్కర్‌, రమణ, తదితరులు పాల్గొన్నారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....