
హైదరాబాద్, జూన్ 25, (ఇయ్యాల తెలంగాణ) : దేశంలో అత్యంత డిమాండ్ ఉన్న నగరాలలో హైదరాబాద్ ఒకటి. కోకాపేట పేరు చెబితే ఏకరం వంద కోట్లు ధర పలుకుతుందని రికార్డు ఉంది. దక్షిణాదిన బెంగళూరు, చెన్నై నగరాలకు రియల్ ఎస్టేట్లో హైదరాబాద్ పోటీ ఇస్తోంది. ఈ క్రమంలో గజం భూమి ధర ఏకంగా రూ.2.22 లక్షలు పలికి రికార్డు సృష్టించింది. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం గచ్చిబౌలిలోని ఓ కమర్షియల్ స్థలం గజం ధర రెండు లక్షల పైగా పలకడం నగరవాసులను ఆశ్చర్యానికి గురిచేస్తుంది. హైదరాబాద్ పరిధిలోని హౌసింగ్ బోర్డు స్థలాల వేలం ప్రక్రియను కేపీహెచ్బీనిర్వహించారు. కమర్షియల్ స్థలాల వేలంలో 53 మంది వరకు పోటీదారులు పాల్గొన్నారు. నగరంలోని చింతల్, గచ్చిబౌలి, నిజాంపేట తదితర ప్రాంతాల్లో వివిధ రకాలైన ప్లాట్లకు సోమవారం నాడు హౌజింగ్ బోర్డు అధికారులు బహిరంగ వేలం నిర్వహించారు. చింతల్ ప్రాంతంలో 266 చదరపు గజాల విస్తీర్ణంలోని రెసిడెన్షియల్ ప్లాట్లు, గచ్చిబౌలి ప్రాంతంలో కమర్షియల్ ప్లాట్లు, నిజాంపేటలో 413 చదరపు గజాల ప్లాట్లు వీటిలో ఉన్నాయి. కూకట్పల్లి కెపీహెచ్బీ కాలనీ కమ్యూనిటీ హాల్లో నిర్వించిన ఈ స్థలాల వేలం పాటలో 55 మంది పాల్గొన్నారని హౌజింగ్ కమిషనర్ పేర్కొన్నారుగచ్చిబౌలి ప్రాంతంలో 3271 చదరపు గజాల భూములు, చింతల్ ప్రాంతంలో 799.98 చదరపు గజాలు, నిజాంపేటలో 1653 చదరపు అడుగుల విస్తీర్ణంలోని ప్లాట్లను వేలం వేయగా రూ.65.02 కోట్లు బోర్డుకు ఆదాయంగా వచ్చిందిగచ్చిబౌలి హౌజింగ్ బోర్డు కాలనీలో ఉన్న 1487 గజాల కమర్షియల్ ల్యాండ్ ను గజానికి రూ.2.22 లక్షలు చొప్పున సుమారు రూ. 33 కోట్లకు కొనుగోలు చేశారు.
ఈ భూములకు చదరపు గజానికి 1.20 లక్షలను ఆఫ్ సెట్ ధరగా నిర్ధారించగా వేలం పాటలో అది 2.22 లక్షలు పలికింది. అట్లాగే ఇదే ప్రాంతంలోని 1200 గజాల పాఠశాల భూములకు ఆఫ్ సెట్ ధర చదరపు గజానికి 80 వేలుగా నిర్ధారించగా, వేలంలో ఆ భూములకు రూ 1.12 లక్షలకు కొనుగోలు చేశారు. ఇక్కడి రెండు ఎంఐజి ప్లాట్లు చదరపు గజం రూ.1.86 లక్షలు, రూ. 1.32 లక్షల ధరలు పలికాయి. ఒక్క గచ్చిబౌలి ప్రాంతానికి సంబంధించిన భూముల ద్వారానే 55 కోట్ల 56 లక్షల 84 వేల మేర ఆదాయం హౌజింగ్ బోర్డుకు సమకూరింది. కుత్భుల్లాపూర్ మండలంలోని చింతల్ ప్రాంతంలోని హౌజింగ్ బోర్డు ఎంఐజీ ప్లాట్లు కూడా అత్యథిక ధరలతో బహిరంగ వేలంలో అమ్ముడు పోయాయి. ఈ ప్రాంతంలో మొత్తం పది ప్లాట్లను వేలం వేయగా వీటిలో ప్లాట్ నెం.113,114,115ల ద్వారానే సుమారు 8.11 కోట్ల మేర ఆదాయం వచ్చింది. నిజాంపేట` బాచుపల్లిలోని నాలుగు ప్లాట్లను సుమారు రూ.70 లక్షలకు వేలం పాటలో కొనుగోలు చేశారు.గచ్చిబౌలిలో 4 స్థలాలను వేలం వేయగా హాట్ కేక్ లా అన్నీ కొనేశారు. కుక్కలపార్కును ఆనుకుని ఉన్న 1,487 చదరపు గజాల స్థలం వేలం వేయగా, గజానికి రూ.1.20 లక్షలుగా ధర నిర్ణయించారు. వేలంలో పోటీ పడి మరి ఒక్క గజం రూ.2.22 లక్షల చొప్పున రూ.33 కోట్లకు ఒక పోటీదారు దక్కించుకున్నారు.మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ మండలం చింతల్ లోని ఎంజీఐ 10 స్థలాలు వేలంలోకి రాగా, 3 స్థలాలు అమ్ముడుపోయాయి. వీటి వేలం ద్వారా సుమారు రూ.8 కోట్ల ఆదాయం సమకూరింది. బాచుపల్లిలో 8 ప్లాట్లను వేలం వేస్తే 4 కొన్నారు. బీ`1 బ్లాక్ లోని ఎఫ్17 ప్లాటు అత్యధికంగా రూ.18.21 లక్షల ధరకు అమ్ముడుపోయింది. వేలం ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి మొత్తం రూ.65 కోట్ల ఆదాయం సమకూరగా, గచ్చిబౌలి భూముల వేలం ద్వారా 55 కోట్ల రూపాయలు వచ్చాయని హౌసింగ్ బోర్డు కమిషనర్ గౌతమ్ వేలం వివరాలు తెలిపారు.