Hotel లో బాంబు బెదిరింపు కాల్‌ !

పరుగులు పెట్టిన పోలీసులు

సికింద్రాబాద్‌, ఫిబ్రవరి 27 (ఇయ్యాల తెలంగాణ) : సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ ఎదురుగా ఉన్న అశోక్‌ హోటల్‌ లో బాంబు పెట్టినట్లు ఆగంతకుడు చేసిన బెదిరింపు ఫోన్‌ కాల్‌ అందరినీ పరుగులు పెట్టించింది. కంట్రోల్‌ రూమ్‌ నుండి సమాచారం రావడంతో గోపాలపురం పోలీసులు బాంబు, డాగ్‌ స్క్వాడ్‌ సహాయంతో హోటల్లో తనఖిలు నిర్వహించారు. హోటల్లో ఉన్న కస్టమర్లను వెంటనే బయటకు పంపి తనిఖీలు చేయగా బాంబు లేదని తేల్చారు. తనిఖీల అనంతరం నకిలీ ఫోన్‌ కాల్‌ గా గుర్తించారు.. మానసిక స్థితి సరిగా లేని ఓ వ్యక్తి ఫోన్‌ కాల్‌ చేసినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. గతంలో కరీంనగర్లో కూడా ఇదే మాదిరిగా బాంబు పెట్టినట్లు ఫోన్‌ కాల్‌ చేసినట్లు పోలీసులు తెలిపారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....