Hyderabadలో 2రోజులు సెలవులు – Essential సర్వీసులు పనిచేస్తాయి

హైదరాబాద్, జూలై 20 (ఇయ్యాల తెలంగాణ) :  తెలంగాణ రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలతో పాటు ప్రభుత్వ కార్యాలయాలకు రెండు రోజుల పాటు సెలవులు ప్రకటిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో భాగంగా తేదీ 21,22 తేదీలలో ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలకు సెలవులు ప్రకటించింది.ఇంతకు ముందే విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించిన ప్రభుత్వం ప్రభుత్వ కార్యాలయాలకు సెలవులు ప్రకటించింది. ప్రభుత్వంలోని అత్యవసర విభాగంలోని శాఖలు ఎమర్జెన్సీ సర్వీసులు యధావిధిగా పనిచేస్తాయని ప్రభుత్వం ప్రకటించింది.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....