హైదరాబాద్, జనవరి 11 (ఇయ్యాల తెలంగాణ) : హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టిని నూతన సంవత్సర వేడుకలను పురస్కరించుకొని తెలంగాణ నాల్గవ తరగతి ఉద్యోగుల సంఘం హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు వర్కాల సత్యనారాయణ తన తోటి ఉద్యోగులతో కలసి మర్యాద పూర్వకంగా కలిశారు. కొత్త సంవత్సరం శుభాకాంక్షలు తెలపడంతో పాటు, పుష్పగుచ్చాన్ని అందించి, శాలువాతో సన్మానించారు. నాల్గవ తరగతి ఉద్యోగులకు అందాల్సిన సౌకర్యాలను అందేలా సహకారం అందించాలని కలెక్టర్ ను కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి ఆర్. మహేందర్, కోశాధికారి అహ్మద్ పాషా, కార్యవర్గ సభ్యులు మల్లికార్జున్, మురళి తదితరులు పాల్గొన్నారు.
- Homepage
- Charminar Zone
- Hyderabad కలెక్టర్ ను కలిసిన వర్కాల సత్యనారాయణ
Hyderabad కలెక్టర్ ను కలిసిన వర్కాల సత్యనారాయణ
Leave a Comment