Hyderabad లో డ్రగ్స్‌ ఓవైపు..గంజాయి ఓ వైపు !

హైదరాబాద్‌, జూలై 17 (ఇయ్యాల తెలంగాణ) : ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా డ్రగ్స్‌, గంజాయి అక్రమ మార్గాల ద్వారా హైదరాబాద్‌ కు చేరుతోంది. స్కూల్‌ విద్యార్థులు, కాలేజ్‌ యువత టార్గెట్‌ గా డ్రగ్‌ ఫెడ్లర్లు డ్రగ్స్‌ సరఫరా చేస్తున్నారు. కిరాణ షాపుల్లో గంజాయి చాక్లెట్లు అమ్ముతున్నారు. దీంతో స్కూల్‌ విద్యార్థులు ఈ చాక్లెట్లు తింటున్నారు. జగద్గిరిగుట్ట పోలీస్‌ స్టేషన్‌ పరిధిలొలోని లెనిన్నగర్‌ కిరాణం షాప్‌ లో గంజాయి చాక్లెట్లు అమ్ముతున్న సునీత దేవి గోస్వామి అనే మహిళను అదుపులోకి తీసుకున్నారు బాలానగర్‌ ఎస్‌ ఓ టి పోలీసులు. 9.5 కిలోల గంజాయి చాక్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. జగద్గిరి గుట్ట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....