Hyderabad, Cyberabad ,Racha Konda పోలీస్‌ కమిషనర్ల బదిలీ !

హైదరాబాద్‌ నూతన సీపీగా కొత్త కోట శ్రీనివాస్‌రెడ్డి

హైదరాబాద్‌ డిసెంబర్‌ 12 (ఇయ్యాల తెలంగాణ) : తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక ముఖ్యమంత్రిగా రేవంత్‌ రెడ్డి బాధ్యతలు చేపట్టాక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఐపీఎస్‌ బదిలీలకు మొదటి సారి శ్రీకారం చుట్టారు. కీలకమైన బాధ్యతల్లో ఉన్న ఐపీఎస్‌ అధికారుల బదిలీలు జరిగాయి. హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండ కమిషనరేట్‌ పరిధిలో కమిషనర్లను బదిలీ చేస్తూ రేవంత్‌ సర్కార్‌ నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్‌ నూతన సీపీగా కొత్త కోట శ్రీనివాస్‌రెడ్డి నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాచకొండ సీపీగా సుధీర్‌ బాబు సైబరాబాద్‌ సీపీగా అవినాష్‌ మహంతి నియమితులయ్యారు. అలాగే హైదరాబాద్‌ పాత సీపీ సందీప్‌ శాండిల్యాను తెలంగాణ నార్కోటిక్‌ బ్యూరో డైరక్టర్‌గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే సైబరాబాద్‌ సీపీ స్టీఫెన్‌ రవీంద్ర, రాచకొండ సీపీ చౌహన్‌ను డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్‌ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....