Hyderabad లో జీ ప్లస్‌ 3 అపార్ట్‌ మెంట్స్జ్‌

హైదరాబాద్‌, జూన్‌ 10, (ఇయ్యాల తెలంగాణ) : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా ప్రస్తుతం గ్రామాల్లోని పేదలు ఇంటి నిర్మాణాలు చేపడుతున్నారు. ఇప్పటికే కొందరు పనులు మె?దలుపెట్టగా.. మరికొందరు ఇంటి నిర్మాణానికి రెడీ అవుతున్నారు. ఇక గ్రేటర్‌ హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని పలు నగరాలు, పట్టణాల్లోనూ ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి పేదలకు ఇవ్వాలని సర్కార్‌ నిర్ణయించింది. జీG3 విధానంలో గృహాల నిర్మాణానికి స్థలాల అన్వేషణను ప్రారంభించింది. ఈ పథకం ద్వారా నిరుపేదలకు సొంత ఇళ్లు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది.గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోని 16 మురికివాడల్లో గృహనిర్మాణ శాఖ అధికారులు ఇప్పటికే కొన్ని స్థలాలను గుర్తించారు. వీటిలో ఐఎస్‌ సదన్‌ సవిూపంలోని సరళాదేవినగర్‌, దిల్‌సుఖ్‌నగర్‌లోని పిల్లిగుడిసె ప్రాంతాల్లో జీG3 నిర్మాణాలకు ఎలాంటి సమస్యలు లేవని నిర్ధారించారు. అయితే మిగిలిన 14 ప్రాంతాల్లో మాత్రం వివాదాలు, స్థానికంగా ఇబ్బందులు, కొన్నిచోట్ల కోర్టు కేసులు ఉన్నట్లు అధికారుల దృష్టికి వచ్చింది. ఈ నేపథ్యంలో రెవెన్యూ, గృహనిర్మాణ, జీహెచ్‌ఎంసీ అధికారులు కలిసి మరోసారి పూర్తిస్థాయిలో సర్వే నిర్వహించాలని నిర్ణయించారు. జీహెచ్‌ఎంసీ టౌన్‌ ప్లానింగ్‌ నిబంధనలకు అనుగుణంగా బ్లాకులను నిర్మించడానికి ఈ స్థలాలు సరిపోతాయా అన్నది కూడా ఈ సర్వేలో పరిశీలించనున్నారు.

ఎంత పని చేసింది…ఒక్కో బ్లాక్‌ నిర్మాణానికి కనీసం 500 గజాల స్థలం అవసరమని గృహనిర్మాణ శాఖ అంచనా వేస్తోంది. ఇందులో రోడ్డు, డ్రైనేజీ వంటి మౌలిక సదుపాయాల కోసం 150 గజాల స్థలం కేటాయించాలి. ఒక్కో బ్లాక్‌లో 16 ఇందిరమ్మ ఇళ్లు నిర్మించేందుకు వీలు ఉంటుంది. జీహెచ్‌ఎంసీ పరిధిలో ఒక్కో నియోజకవర్గానికి 3,500 చొప్పున మొత్తం 84 వేల ఇళ్లను కేటాయించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే గుర్తించిన మురికివాడల్లో పరిమిత స్థలాలు ఉండటంతో, గ్రేటర్‌ పరిధిలోని మిగిలిన ప్రభుత్వ, మురికివాడల స్థలాలపై కూడా మరో సర్వే నిర్వహించనున్నారు. ఈ సర్వే తర్వాత ఎన్ని ప్రాంతాల్లో జీG3 బ్లాక్‌లు నిర్మించనున్నారు, మొత్తం ఎన్ని ఫ్లాట్లు అందుబాటులోకి వస్తాయనే దానిపై గృహనిర్మాణ శాఖ తుది నిర్ణయం తీసుకోనుంది.

జిల్లాల్లోని పలు నగరాలు, పట్టణాల్లోనూ మురికివాడల ప్రజలకు జీG3 విధానంలో ఇందిరమ్మ ఇళ్లను నిర్మించి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. వరంగల్‌, కరీంనగర్‌, నిజామాబాద్‌, ఖమ్మం, మహబూబ్‌నగర్‌, నల్గొండ తదితర ప్రాంతాల్లోని పేదల బస్తీల్లో ఇళ్ల నిర్మాణానికి అనువైన స్థలాలను గుర్తించి త్వరగా ప్రతిపాదనలు పంపించాలని జిల్లా కలెక్టర్లు, హౌసింగ్‌ పీడీలను ఉన్నతాధికారులు కోరారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....