ICET కౌన్సెలింగ్‌ September 6 కు వాయిదా

హైదరాబాద్‌ ఆగష్టు 12 (ఇయ్యాల తెలంగాణ) : టీఎస్‌ ఐసెట్‌ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌లో స్వల్ప మార్పులు జరిగాయి. ఈ నెల 14 నుంచి జరగాల్సిన ఐసెట్‌ కౌన్సెలింగ్‌ను వాయిదా వేశారు. సెప్టెంబర్‌ 6 నుంచి కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నారు.8 నుంచి 12వ తేదీ వరకు అభ్యర్థుల ధ్రువపత్రాలను పరిశీలించనున్నారు. 8 నుంచి 13 వరకు వెబ్‌ ఆప్షన్లు నమోదు చేసుకోవడానికి సమయం ఇచ్చారు. సెప్టెంబర్‌ 17వ తేదీన ఎంబీఏ, ఎంసీఏ తొలి విడుత సీట్లను కేటాయించనున్నారు. సెప్టెంబర్‌ 22 నుంచి ఐసెట్‌ తుది విడుత కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....