IMA నంద్యాల మిషన్‌ Pink Health ఆధ్వర్యంలో ఘనంగా జాతీయ బాలిక దినోత్సవం

జాతీయ బాలికా దినోత్సవం లో ఐఎంఏ నంద్యాల మిషన్‌ పింక్‌ హెల్త్‌ 

యువ వాట్సప్‌ హెల్ప్‌ లైన్‌ ఆవిష్కరణ.

నంద్యాల, జనవరి 24 (ఇయ్యాల తెలంగాణ) : నంద్యాల ఐఎంఏ మిషన్‌ పింక్‌ హెల్త్‌ విభాగం ఆధ్వర్యంలో స్థానిక మధుమణి ఆసుపత్రి సమావేశ భవనంలో జాతీయ బాలిక దినోత్సవం ఘనంగా నిర్వహించారు. మిషన్‌ పింక్‌ హెల్త్‌ విభాగం అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్‌ నెరవాటి అరుణకుమారి, డాక్టర్‌ సుసుమ, డాక్టర్‌ శైలజల నిర్వహణలో జరిగిన ఈ కార్యక్రమంలో శిల్పా మహిళా సహకార్‌ చైర్‌ పర్సన్‌ నాగిని రెడ్డి, ఐఎంఏ రాష్ట్ర మాజీ అధ్యక్షులు, మాజీ రాష్ట్ర అధ్యక్షుల ఫోరం చైర్మన్‌ డాక్టర్‌ జి రవికృష్ణ ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రసంగించారు. 

ఈ సందర్భంగా మహిళా సాధికారతపై నంద్యాల ఐఎంఏ మిషన్‌ పింక్‌ హెల్త్‌ విభాగం రూపొందించిన వీడియోను డాక్టర్‌ రవి కృష్ణ ఆవిష్కరించారు.

బాలికలు, యువతుల కోసం నంద్యాల మిషన్‌ పింక్‌ హెల్త్‌ వాట్సాప్‌ హెల్ప్‌ లైన్‌ ను నాగిని రెడ్డి ఆవిష్కరించారు.

డాక్టర్‌ అరుణకుమారి మాట్లాడుతూ వాట్సాప్‌ హెల్ప్‌ లైన్‌ ద్వారా బాలికలు,యువతుల ఆరోగ్య సంబంధ సందేహాలకు మహిళా వైద్యులు సమాధానాలు ఇస్తారని తెలిపారు.

నాగిని రెడ్డి మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాలలో ఈరోజు ముందంజ వేస్తున్నారని ,విజయాలు సాధిస్తున్నారని,తల్లిదండ్రులు బాలికలను వారు ఎంచుకున్న రంగంలో రాణించేలాగా ప్రోత్సహించాలని కోరారు.

డాక్టర్‌ రవి కృష్ణ మాట్లాడుతూ దేశంలో వైద్య, ఆరోగ్య రంగంలో వివిధ స్పెషాలిటీ మహిళా వైద్యుల ప్రాధాన్యత పెరుగుతున్నదని, నంద్యాల ఐఎంఏ  మహిళా వైద్య విభాగం, మిషన్‌ పింక్‌ హెల్త్‌ విభాగం సామాజిక సేవా కార్యక్రమాల్లో విరివిగా పాల్గొంటున్నారని అభినందించారు.

ఈ కార్యక్రమంలో ఐఎంఏ నంద్యాల అధ్యక్షురాలు డాక్టర్‌ వసుధ, కార్యదర్శి డాక్టర్‌ పనిల్‌ కుమార్‌, డాక్టర్‌ సహదేవుడు, డాక్టర్‌ మధుసూదనరావు, డాక్టర్‌ మధుసూదన్‌ రెడ్డి ,డాక్టర్‌ నాగమణి ,డాక్టర్‌ నర్మద ,డాక్టర్‌ కల్పన, డాక్టర్‌ సరిత, డాక్టర్‌ సునీత, డాక్టర్‌ మాధవి,డాక్టర్‌ లలిత, డాక్టర్‌ తనూజ, పలువురు మహిళా వైద్యులు, ఆసుపత్రుల మహిళా ఉద్యోగులు, పాఠశాల బాలికలు పాల్గొన్నారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....