IPS అధికారి అంజనీకుమార్‌పై సీ EC సస్పెన్షన్‌ ఎత్తివేత

హైదరాబాద్‌ డిసెంబర్‌ 12 (ఇయ్యాల తెలంగాణ) : ఐపీఎస్‌ అధికారి అంజనీకుమార్‌పై సీఈసీ సస్పెన్షన్‌ను ఎత్తివేసింది. అంజనీకుమార్‌ విజ్ఞప్తిని సీఈసీ పరిగణనలోకి తీసుకుంది. ఉద్దేశపూర్వకంగా ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించలేదని ఆయన తెలిపారు. ఎన్నికల ఫలితాల రోజు రేవంత్‌ రెడ్డి పిలిస్తేనే వెళ్లానని.. ఇలాంటి ఘటన పునరావృతం కాదని సీఈసీకి అంజనీకుమార్‌ హావిూ ఇచ్చారు. దీంతో సస్పెన్షన్‌ ఎత్తివేస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి సీఈసీ సమాచారం అందజేసింది. కాగా.. తెలంగాణ ఎన్నికల ఫలితాలు వెల్లడైన సమయంలో అంజనీకుమార్‌ రాష్ట్ర డీజీపీగా ఉన్నారు. ఈ క్రమంలో ఫలితాలు వెల్లడవుతుండగానే రేవంత్‌రెడ్డిని అంజనీకుమార్‌ కలిశారు. ఈ విషయాన్ని సీఈసీ సీరియస్‌గా తీసుకుంది. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించారంటూ అంజనీకుమార్‌ను ఈసీ సస్పెండ్‌ చేసింది. చివరకు దీనిపై వివరణ ఇచ్చుకోగా.. దాన్ని పరిగణలోకి తీసుకున్న సీఈసీ.. అంజనీకుమార్‌ సస్పెన్షన్‌ ఎత్తివేస్తూ సీఈసీ నిర్ణయం తీసుకుంది.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....