IRAN బెదిరింపు నేపథ్యంలో.. హై అలర్ట్‌లో IZRAIL

గాజా ఏప్రిల్‌ 13 (ఇయ్యాల తెలంగాణ) :  ఇజ్రాయిల్‌ పై ఏ క్షణమైనా ఇరాన్‌ అటాక్‌ చేస్తుందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ వెల్లడిరచిన విషయం తెలిసిందే. ఏప్రిల్‌ ఒకటో తేదీన డమస్కస్‌లో జరిగిన ఓ దాడి కేసులో ఆగ్రహంతో ఉన్న ఇరాన్‌.. దానికి ప్రతీకారంగా ఇజ్రాయిల్‌పై అటాక్‌ చేయాలన్న దీక్షతో ఉన్నది. శుక్రవారం ఎటువంటి దాడి జరగపోయినా. ఇజ్రాయిల్‌ రక్షణ దళాలు మాత్రం హై అలర్ట్‌లో ఉన్నాయి. కొన్ని చోట్ల యాంటీ మిస్సైల్‌ మొబైల్‌ లాంచర్లను అప్రమత్తం చేశారు. ఇరాన్‌ దాడుల్ని తిప్పికొట్టేందుకు ఇజ్రాయిల్‌ దళాలు కంటి విూద కునుకు లేకుండా జాగ్రత్తగా ఉన్నాయి. లెబనాన్‌లో ఉన్న హిజ్‌బుల్లా కేంద్రాన్ని శుక్రవారం టార్గెట్‌ చేసిన ఇజ్రాయిల్‌ ప్రకటించింది.ఇజ్రాయిల్‌పై ఇరాన్‌ దాడి చేసే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో.. లుఫ్తాన్సా విమాన సంస్థ తమ విమానాలను నిలిపివేసింది. ఇరాన్‌ వైమానిక మార్గాన్ని వాడడం లేదని చెప్పింది. టెహ్రాన్‌ నుంచి వచ్చి వెళ్లే విమానాలను రద్దు సస్పెండ్‌ చేసినట్లు లుఫ్తాన్సా ఎయిర్‌లైన్స్‌ పేర్కొన్నది. ఏప్రిల్‌ 18వ తేదీ వరకు విమానాల రాకపోకలు ఉండదని, ఇరానియన్‌ ఎయిర్‌ స్పేస్‌ను కూడా వాడడం లేదని లుఫ్తాన్సా చెప్పింది.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....