4 లక్షల కిలో విూటర్ల ప్రయాణం –
బెంగళూరు, జూలై 27, (ఇయ్యాల తెలంగాణ) : భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్`3 విజయవంతంగా ఐదు దశలను పూర్తి చేసుకుని చంద్రుడివైపు వేగంగా కదులుతోంది. భూగురుత్వాకర్షణ పరిధిని దాటి ప్రస్తుతం చంద్రుడి వైపు సాగుతోంది చంద్రయాన్`3. తదుపరి చేపట్టే దశలు అన్నీ చంద్రయాన్`3 ప్రయోగానికి కీలకమే అని ఇస్రో అధికారులు చెబుతున్నారు. ఆగస్టు 1, 2023 నిర్దేశించిన ప్రకారం చంద్రుడి గురుత్వాకర్షణ పరిధిలోకి ప్రవేశించనుంది. ఈ మిషన్ లో ఇది కీలకమైన దశగా ఇస్రో శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. ఈ దశలో చంద్రయాన్`3 చంద్రుని గురుత్వాకర్షణ పరిధిలోని కక్ష్యలోకి చేరుతుంది. క్రమంగా ఈ కక్ష్య పరిధిని కుదించుకుంటూ చంద్రునికి దగ్గరగా వెళ్తుంది. 1,27,609 కి.విూ లీ 236 కి.విూ కక్ష్యను చేరుకుని క్రమంగా చంద్రునికి దగ్గరగా వెళ్తుంది. అలా ఆగస్టు చివరి నాటికి చంద్రునికి 30 కిలోవిూటర్ల దగ్గరి వరకు వెళ్తుంది. ఆ సమయానికి చంద్రయాన్`3 చంద్రుని దక్షిణ ధ్రువ ప్రాంతానికి చేరుకున్న తర్వాత అసలు సిసలు పరీక్ష ప్రారంభం అవుతుంది. చంద్రయాన్`3 రోవర్ సాఫ్ట్ ల్యాండిరగ్ అవుతుంది.
చంద్రుడిపై గ్రావిటీకి తగ్గట్టుగా మాడ్యూల్ మెల్లగా కిందకు దిగుతుంది. ల్యాండర్ విడిపోతుంది. లాంఛ్ అయినప్పటి నుంచి సరిగ్గా నెల రోజుల తరవాత చంద్రుడిపై మాడ్యూల్ దిగుతుంది.చైనా, రష్యాలు జంబో రాకెట్లను ఉపయోగించి చంద్రుడిపైకి ఉపగ్రహాలను పంపించాయి. చైనా, అమెరికా దాదాపు రూ.1000 కోట్ల వరకు ఖర్చు చేస్తుండగా.. ఇస్రో మాత్రం రూ.500 కోట్ల నుంచి రూ.600 కోట్లతోనే ప్రయోగం చేపడుతోంది. చంద్రుడి కక్ష్య వరకు వెళ్లే శక్తివంతమైన రాకెట్ సైతం ఇస్రో వద్ద లేకపోయినా క్లిష్టమైన ప్రక్రియలో ప్రయోగం చేపట్టింది.
భారత్ సత్తా ప్రపంచమంతా చాటేలా ప్రయోగం చేసింది.ఇటలీలోని మన్సియానోకు చెందిన వర్చువల్ టెలిస్కోప్ ప్రాజెక్ట్ అంతరిక్షంలో తిరుగుతూ చంద్రుడి వైపు ప్రయాణిస్తున్న చంద్రయాన్`3ను చిత్రీకరించింది. అందులో చంద్రయాన్`3 ఓ చుక్కలా వేగంగా ప్రయాణిస్తోంది. భూమికి 341 కిలోవిూటర్ల ఎత్తులో చంద్రయాన్`3 కదలికలను వర్చువల్ టెలిస్కోప్ గుర్తించింది. ఈ వీడియో సోషల్ విూడియాలో ట్రెండిరగ్ అయ్యింది. ఇటలీకి చెందిన ఈ వర్చువల్ టెలిస్కోప్ ఖగోళానికి చెందిన పలు విషయాలను ఎప్పటికప్పుడు గుర్తించి సమాచారం ఇస్తూ ఉంటుంది. చంద్రయాన్`3 విషయంలోను ఈ టెలిస్కోప్ తన పనితనం, నైపుణ్యం ప్రదర్శించింది.