July 17న ‘మేఘాలు చెప్పిన ప్రేమ కథ’

యంగ్‌ హీరో నరేష్‌ అగస్త్య, దర్శకుడు విపిన్‌ దర్శకత్వంలో, సునేత్ర ఎంటర్టైన్మెంట్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ బ్యానర్‌ పై ఉమా దేవి కోట నిర్మించిన మ్యూజికల్‌ రొమాంటిక్‌ డ్రామా ‘మేఘాలు చెప్పిన ప్రేమ కథ’లో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉన్నారు. చిత్రంలో రబియా ఖతూన్‌ కథానాయిక. ఇప్పటికే రిలీజ్‌ అయిన రెండు టీజర్లు, సాంగ్స్‌ సినిమాపై అంచనాలను పెంచాయి. తాజాగా మేకర్స్‌ సినిమా రిలీజ్‌ డేట్‌ ని అనౌన్స్‌ చేశారు. జూలై 17న ఈ సినిమా గ్రాండ్‌ గా రిలీజ్‌ కానుంది. హీరో నరేష్‌ అగస్త్యతో పాటు ప్రధాన నటులంతా కనిపించిన రిలీజ్‌ డేట్‌ అనౌన్స్మెంట్‌ పోస్టర్‌ చాలా ప్లజెంట్‌ గా వుంది.  జస్టిన్‌ ప్రభాకరన్‌ ఈ చిత్రానికి మ్యూజిక్‌ అందిస్తున్నారు. మోహన కృష్ణ ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీని నిర్వహిస్తున్నారు, తోట తరణి ఆర్ట్‌ డైరెక్టర్‌ కాగా మార్తాండ్‌ కె వెంకటేష్‌ ఎడిటర్‌. ‘మేఘాలు చెప్పిన ప్రేమ కథ’ ఆడియన్స్‌ కి మంచి థియేట్రికల్‌ ఎక్స్‌ పీరియన్స్‌ అందించబోతోంది.

తారాగణం: నరేష్‌ అగస్త్య, రబియా ఖాతూన్‌, రాధిక శరత్‌కుమార్‌, తనికెళ్ల భరణి, వెంకటేష్‌ కాకుమాను, విద్యుల్లేఖ, సుమన్‌, ఆమని, తులసి, చైల్డ్‌ ఆర్టిస్ట్‌ మాస్టర్‌ కార్తికేయ, మోహన్‌ రామన్‌ .

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....