July 24న పవన్‌ కళ్యాణ్‌ Movie ‘హరి హర వీరమల్లు’ విడుదల

పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ చారిత్రక యోధుడిగా కనువిందు చేయనున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘హరి హర వీరమల్లు’. ప్రముఖ నిర్మాత ఎ.ఎం. రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్స్‌ పతాకంపై ఎ. దయాకర్‌ రావు నిర్మిస్తున్న ఈ చిత్రానికి క్రిష్‌ జాగర్లమూడి, జ్యోతి కృష్ణ దర్శకులు. ఆస్కార్‌ విజేత ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. నిధి అగర్వాల్‌ కథానాయికగా నటిస్తున్న ‘హరి హర వీరమల్లు’లో బాబీ డియోల్‌ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు.

పవన్‌ కళ్యాణ్‌ మొదటిసారి చారిత్రక యోధుడిగా నటిస్తుండటంతో పాటు, భారీ బడ్జెట్‌ తో పాన్‌ ఇండియా చిత్రంగా రూపొందుతుండటంతో ‘హరి హర వీరమల్లు’పై భారీ అంచనాలు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియులు, పవన్‌ కళ్యాణ్‌ అభిమానులు ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు, గీతాలు విశేషంగా ఆకట్టుకున్నాయి.

గ్లింప్స్‌, టీజర్‌ లో యోధుడిగా కనిపించిన పవన్‌ కళ్యాణ్‌ లుక్‌ కి, అద్భుతమైన విజువల్స్‌ కి విశేష స్పందన లభించింది. ‘మాట వినాలి’, ‘కొల్లగొట్టినాదిరో’, ‘అసుర హననం’, ‘తార తార’ గీతాలు ఒక దానిని మించి మరొకటి శ్రోతలను మెప్పించాయి. రికార్డు వ్యూస్‌ తో సామాజిక మాధ్యమాల్లో సంచలనాలు సృష్టిస్తున్నాయి.

’హరి హర వీరమల్లు’ నుంచి వచ్చే ప్రతి కంటెంట్‌ సినిమాపై అంచనాలు పెంచేస్తోంది. ఆ అంచనాలకు తారాస్థాయికి తీసుకెళ్ళేలా.. అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్న ట్రైలర్‌ త్వరలో విడుదల కాబోతుంది. అంతేకాదు, చిత్ర విడుదల తేదీని కూడా తాజాగా నిర్మాతలు ప్రకటించారు. ఈ చిత్రం జూలై 24వ తేదీన తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల కానుంది.

ఈ చిత్రానికి మనోజ్‌ పరమహంస మరియు జ్ఞాన శేఖర్‌ వి.ఎస్‌. ఛాయాగ్రాహకులుగా వ్యవహరిస్తున్నారు. ప్రవీణ్‌ కె.ఎల్‌. ఎడిటింగ్‌ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ప్రముఖ కళా దర్శకుడు తోట తరణి నభూతో నభవిష్యతి అన్నచందాన అద్భుతమైన సెట్‌ లను రూపొందించారు.

చారిత్రాత్మక నేపథ్యంలో అద్భుతమైన నాటకీయత, శక్తివంతమైన ప్రదర్శనలు, ఉత్కంఠభరితమైన యాక్షన్‌ తో రూపొందిన ‘హరి హర వీరమల్లు’ చిత్రం ప్రేక్షకులను వెండితెరపై గొప్ప అనుభూతిని కలిగించనుంది. ఈ సినిమాలోని ప్రతి సన్నివేశం ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోతుందని చిత్ర బృందం ఎంతో నమ్మకంగా ఉంది.

తారాగణం: పవన్‌ కళ్యాణ్‌, నిధి అగర్వాల్‌, బాబీ డియోల్‌, అనుపమ్‌ ఖేర్‌, సత్యరాజ్‌, జిషు సేన్‌గుప్తా, నాజర్‌, సునీల్‌, రఘుబాబు, సుబ్బరాజు, నరా ఫతేహి

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....