June 22 న GST మండలి సమావేశం

న్యూఢిల్లీ, జూన్‌ 13 (ఇయ్యాల తెలంగాణ) :  వస్తువులు, సేవల పన్ను(జిఎస్‌ టి) మండలి జూన్‌ 22 న సమావేశం కావాలని నిర్ణయించింది. ఈ సమావేశం ఈ ఏడాది తొలి సమావేశం కానున్నది. ఈ విషయాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ గురువారం తెలిపారు. ఈ 53వ జిఎస్‌ టి కౌన్సిల్‌ సమావేశం జూన్‌ 22న న్యూఢల్లీిలో జరుగనుందని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది.జిఎస్‌ టి కౌన్సిల్‌ సాధారణంగా ప్రతి మూడు నెలలకోసారి సమావేశం కావల్సి ఉంటుంది. కానీ 2022 నుంచి ఇప్పటి వరకు కేవలం ఆరు సార్లే సమావేశం అయింది. జరుగనున్న జిఎస్‌ టి కౌన్సిల్‌ సమావేశం ఏజెండా ఏమిటన్నది తెలియలేదు. అయితే రాష్ట్ర ఆర్థిక మంత్రులు కొన్ని పరోక్ష పన్నులను కేంద్ర బడ్జెట్‌ లో చేర్చాలని కోరవచ్చని అనుకుంటున్నారు.బెట్టింగ్‌ వాటి విూద జిఎస్‌ టి 28 శాతం వేయడం వల్ల జిఎస్‌ టి ఆదాయం గణనీయంగా పెరిగింది. ముఖ్యంగా ఆన్‌ లైన్‌ గేమింగ్‌, క్యాసినోలు, గుర్రపు పందేలు వంటి వాటివిూద అధిక జిఎస్‌ టి విధించబడుతోంది. గుర్రపు పందేలాడేవారికి జిఎస్‌ టి తో  పాటు ఎంట్రీ ఫీజు కూడా గణనీయంగానే ఉంది. హైదరాబాద్‌ లో ఆఫ్‌ కోర్సు టోట్‌ ఎంట్రీ ఫీజు రూ. 150 వరకు ఉంది. ఇక రేస్‌ కోర్స్‌ మెయిన్‌ ఎంట్రీ ఫీజయితే దీనికంటే డబుల్‌ ఉంటుంది. జిఎస్‌ టి రేట్లు హేతుబద్ధంగా ఉన్నాయా అన్నది ప్రశ్న.                

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....