June 29 నుంచి అమర్‌ నాధ్‌ యాత్ర ! ఉగ్రవాదుల టార్గెట్‌తో భద్రత పటిష్టం !

శ్రీనగర్‌, జూన్‌ 19, (ఇయ్యాల తెలంగాణ) : అమర్‌నాథ్‌ యాత్రకు గట్టి భద్రత కల్పిస్తోంది కేంద్రం. ఈనెల 29వ తేదీ నుంచి అమర్‌నాథ్‌ యాత్ర ప్రారంభమవుతుంది. అయితే రియాసిలో కొద్దిరోజుల క్రితం టూరిస్టుల బస్సును ఉగ్రవాదులు టార్గెట్‌ చేయడంతో ఈసారి భద్రతను రెట్టింపు చేస్తున్నారు. జమ్ము లోని భగవతి నగర్‌లో ఉన్న బేస్‌ క్యాంప్‌ దగ్గర మాక్‌డ్రిల్‌ నిర్వహించారు. జమ్ముకశ్మీర్‌ పోలీసులతో పాటు ఆర్మీ జవాన్లు ఈ మాక్‌డ్రిల్‌లో పాల్గొన్నారు. జమ్ముకశ్మీర్‌ స్పెషల్‌ ఆపరేషన్స్‌ గ్రూప్‌ , క్విక్‌ రియాక్షన్‌ టీమ్‌ కమెండోలు ఈ మాక్‌డ్రిల్‌లో పాల్గొన్నారు. అమర్‌నాథ్‌ యాత్రికులపై ఉగ్రవాదులు దాడి చేస్తే ఎలా తిప్పికొట్టాలన్న విషయంపై మాక్‌డ్రిల్‌లో శిక్షణ ఇచ్చారు. రియాసిలో జరిగిన ఉగ్రదాడిలో 9 మంది టూరిస్టులు చనిపోయారు. గత వారం రోజులుగా జమ్ముకశ్మీర్‌లో వరుస ఉగ్రదాడులు కలకలం రేపుతున్నాయి. జమ్ముకశ్మీర్‌లో శాంతిభద్రతలపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా ఉన్నతస్థాయి సవిూక్ష నిర్వహించారు.

 

అమర్‌నాథ్‌ యాత్రకు గట్టి భద్రత కల్పించాలని ఆదేశాలు జారీ చేశారు.ప్రధాని మోదీ కూడా ఈనెల 20వ తేదీన జమ్ముకశ్మీర్‌లో పర్యటిస్తున్నారు. శ్రీనగర్‌లో జూన్‌ 21వ తేదీన యోగా డే వేడుకలకు ఆయన హాజరవుతున్నారు. శ్రీనగర్‌లో యువ సమ్మేళనానికి కూడా ప్రధాని హాజరవుతారు. ప్రధాని పర్యటన సందర్భంగా జమ్ముకశ్మీర్‌లో గట్టి భద్రతా చర్యలు చేపట్టారు. రెండు రోజుల పాటు కశ్మీర్‌లో ప్రధాని పర్యటన కొనసాగుతుంది. మూడోసారి ప్రధాని పగ్గాలు చేపట్టాక జమ్ముకశ్మీర్‌లో తొలిసారి ఆయన పర్యటిస్తున్నారు.అమర్‌నాథ్‌ యాత్ర 45 రోజుల పాటు కొనసాగనుంది. యాత్రికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నారు. జమ్ముకశ్మీర్‌లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రధాని మోదీ అక్కడ పర్యటించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ప్రధాని పర్యటనతో రాష్ట్రంలో పొలిటికల్‌ హీట్‌ పెరిగే అవకాశ ఉంది.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....