KCR ఆరోగ్యంపై వాకబు చేసిన CM రేవంత్‌

హైదరాబాద్‌ డిసెంబర్ 8 (ఇయ్యాల తెలంగాణ ): మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆరోగ్యంపై సీఎం రేవంత్‌ రెడ్డి వాకబు చేసారు. కెసిఆర్‌ వైద్యం పై ఎప్పటికప్పుడు పరిస్థితి తనకు తెలియచేయాలని ఐఎఎస్‌ లకు సూచించారు. మేరుగైన వైద్యం అందించాలని ఆరోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ కి సూచించారు రేవంత్‌ రెడ్డి ఆదేశాల మేరకు యశోద హాస్పిటల్‌ కు ఆరోగ్యశాఖ కార్యదర్శి వెళ్లారు.  యశోద ఆసుపత్రి వైద్యులను అడిగి కెసిఆర్‌ ఆరోగ్య పరిస్థితి అధికారులు  గురించి తెలుసుకున్నారు. మాజీ సీఎం కేసీఆర్‌ ఆరోగ్యం నిలకడగా ఉందని హెల్త్‌ సెక్రటరీ కి యశోద వైద్యులు  చెప్పారు. కెసిఆర్‌ కు మెరుగైన వైద్య చికిత్స అందించాలని అధికారులకు సీఎం  సూచించారు. 

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....