KCR ను పరామర్శించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

హైదరాబాద్, డిసెంబర్ 10 (ఇయ్యాల తెలంగాణ) : తెలంగాణ రాష్ట్ర ప్రస్తుత శాసనసభాపక్ష నేత మాజీ ముఖ్యమంత్రి  కె చంద్రశేఖర్ రావుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం యశోద ఆసుపత్రిలో పరామర్శించారు. గత రెండు రోజుల క్రితం కాలికి ఫ్యాక్టర్ కావడంతో కెసిఆర్ సికింద్రాబాద్ లోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.ఈ సందర్బంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం కేసీఆర్ ను పరామర్శించారు.బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు, యశోద డాక్టర్లను కలిసి కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసు కున్నారు. రేవంత్ రెడ్డి వెంట ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్, ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, డాక్టర్ ఎంవీ రావు తదితరులున్నారు. సీఎం రేవంత్ వెంట మంత్రి సీతక్క, షబ్బీర్ అలీ తదితరులున్నారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....