KVN ప్రొడక్షన్స్‌ నిర్మిస్తోన్న భారీ Movie ‘కేడీ ది డెవిల్‌’

‘కేడీ ది డెవిల్‌’ నుంచి ‘శివ శివ’ పాట విడుదల

కన్నడ ఇండస్ట్రీలో భారీ చిత్రాలను నిర్మిస్తున్న కేవీఎన్‌ ప్రొడక్షన్స్‌ నుంచి యాక్షన్‌ ప్రిన్స్‌ ధృవ సర్జా హీరోగా ‘కేడీ ది డెవిల్‌’ అనే చిత్రం రానుంది. విజనరీ డైరెక్టర్‌ ప్రేమ్‌ దర్శకత్వంలో ఈ మూవీని భారీ ఎత్తు తెరకెక్కుతోంది. తాజాగా ఈ సినిమా నుంచి కన్నడ నేల ఆచార సంస్కృతులు, భారతీయ జానపద గేయాల్లోని అందాన్ని చూపించేలా ‘శివ శివ’ అనే పాటను రిలీజ్‌ చేశారు.

ఈ పాటను హిందీలో అజయ్‌ దేవగణ్‌, తమిళంలో లోకేష్‌ కనకరాజ్‌, తెలుగులో హరీష్‌ శంకర్‌ రిలీజ్‌ చేస్తూ చిత్రయూనిట్‌కు అభినందనలు తెలియజేశారు. అర్జున్‌ జన్యా బాణీ, విలియం డేవిడ్‌ కొరియోగ్రఫీ పాటలోని డెప్త్‌ ఇండియన్‌ ఫోక్‌ మ్యూజిక్‌ గొప్పదనాన్ని చాటి చెబుతున్నాయి. కన్నడలో ఈ పాటను ప్రేమ్‌, కైలాష్‌ కేర్‌ ఆలపించారు. తెలుగు, తమిళంలో విజయ్‌ ప్రకాష్‌.. మలయాళంలో ప్రణవం శశి పాడారు. ఇక హిందీలో కైలాష్‌ కేర్‌, సలీమా మాస్టర్‌ కలిసి ఆలపించారు.

కన్నడలో ఈ పాటను మంజు నాథ్‌ బి.ఎస్‌, తమిళంలో మదన్‌ కార్కి, తెలుగులో చంద్రబోస్‌ హిందీలో రక్విబ్‌ ఆలం, మలయాళంలో మన్‌కోంబు గోపాలకృష్ణన్‌ రాశారు. ఆనంద్‌ ఆడియో లేబుల్‌ విూద ఈ పాటను మార్కెట్‌లోకి విడుదల చేశారు. భిన్నత్వంలో ఏకత్వాన్ని ప్రతిభింబించేలా, భారతీయ జానపద గీతాల్లోని అందాన్ని చూపించేలా ఈ ‘శివ శివ’ అనే పాట సాగుతుంది

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....